* ప్రజల్లో ఎన్నికల పట్ల ఆత్మవిశ్వాసం పెరిగేలా
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట,పత్తిపాక, పెద్దకోడేపాక గ్రామాలల్లో శాయంపేట పోలీసువారు బార్డర్ సెక్యూరిటీ పోలీస్ (ఆర్మీ ) వారితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పరకాల ఏసిపి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు తాను ఓటు హక్కు వినియోగించుకునేలా వారిలో నమ్మకం భరోసా భద్రతా కలిగేలా కేంద్ర బలగాలచే కవాతు నిర్వహించడం జరిగింది. పరకాల రూరల్ సిఐ మల్లేష్ , శాయంపేట ఎస్సై దేవేందర్ ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. 100 మంది పోలీసులు ఫ్లాగ్ మార్చ్‌లో పాల్గొన్నారు.