కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటి ధాత్రి..
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ లు తెలిపారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాలతో, స్థానిక ఎస్సై రాజేందర్ సూచనలు పాటిస్తూ కరక గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని మోతే లిఫ్ట్ వద్ద హెడ్ కానిస్టేబుల్ రవి, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో , సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజలు మోసపూరిత ఫోన్ కాళ్లకు నమ్మి మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు, ఓటీపీలు ఎవరికి చెప్పొద్దని అలా చెప్పినట్లయితే మీ ఖాతా నుంచి డబ్బులు మాయమైతాయని మీ ఖాతా నుంచి డబ్బులు పోతే 1930 కాల్ చేస్తే సైబర్ పోలీసులు మీ ఖాతాలపై ప్రత్యేకంగా నిఘా ఉంటుందని అప్రమత్తంగా ఉంటూ సైబర్ మోసాలకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో , కనకేష్, విజయరావ్ పోలీస్ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు