నేటిధాత్రి, వరంగల్
వరంగల్ జిల్లా, ఖిలా వరంగల్ ఖుషు మహాల్ వద్ద జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ఉత్తమ ఉద్యోగి అవార్డులను ప్రదానం చేశారు. వరంగల్ జిల్లా పోలీస్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు అవార్డులను అందచేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో, మట్ట్వాడ ఏసిపి దగ్గర గన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కె. ఈశ్వర్ పిసి నంబర్ 3322, మట్ట్వాడ పోలీస్ డివిజన్లో ఉత్తమ ఉద్యోగిగా ఎంపికైన సందర్భంగా, వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య చేతుల మీదుగా అవార్డ్ అందుకున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో, వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ, వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్, వరంగల్ ఏసిపి బోనాల కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ఉద్యోగి అవార్డ్ కు ఎంపిక చేసినందుకు పోలీస్ అధికారులకు ఈశ్వర్ కృతజ్ఞతలు తెలియచేశారు.