“నేటిధాత్రి”..”బిగ్ ఎఫెక్ట్
“నేటిధాత్రి” వరుస కథనాలతో, స్పందించిన పోలీస్ కమిషనర్ “సాయి చైతన్య”

“గుట్కా కింగ్ హీరోలాల్ ఎవరు!?..అనే “నేటిధాత్రి” కథనానికి స్పందించిన నిజామాబాద్ “పోలీస్ అధికారులు”.
గుట్కా స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి
“నేటిధాత్రి”నిజామాబాద్ జిల్లా ప్రతినిధి,:
“నేటిధాత్రి”లోవార్త వచ్చిన నేపథ్యంలో, నిజామాబాద్ పోలీస్ “కమిషనర్ సాయి చైతన్య”, ఆధ్వర్యంలో స్పెషల్ టీం, గుట్కా సప్లై కేంద్రాలను గుర్తించి, వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
నిజామాబాద్ నగర శివారులో కొందరు అక్రమంగా గుట్కా తయారు చేస్తున్నారు.విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సదరు ఫ్యాక్టరీపై దాడులు చేశారు.నగర శివారులో అక్రమంగా తయారు చేస్తున్న గుట్కాను “సీసీఎస్ పోలీసులు” పట్టుకున్నారు. జన్నెపల్లి రోడ్డు గల ఓ ఫ్యాక్టరీలో సీసీఎస్ ఏసీపీ “నాగేంద్ర చారి” ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు చేశారు.
అక్కడ గుట్కా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. గుట్కా తయారీకి సంబంధించిన సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. అసాన్, అమీర్ అనే నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. సదరు ఫ్యాక్టరీలో పాన్ మసాలా ముసుగులో గుట్కా తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
