ఘటనకు కారకులైన పోలీస్ అధికారుల పైన చర్యలు తీసుకోవాలి
ఆశ వర్కర్లకు అండగా ఉంటా:మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి :
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆశా వర్కర్లకు నెలకు 18 వేల రూపాయలు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ తమ న్యాయమైన కోరికలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి సోమవారం ఆశ వర్కర్లు మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ కార్యాలయం ముందు శాంతియుతంగా నిరసన చేస్తున్న క్రమంలో పోలీసులు మహిళలలు అనే గౌరవం లేకుండా లాఠీచార్జి చేసి అమానుషంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.గత కెసిఆర్ ప్రభుత్వం ఆశ వర్కర్లను గుర్తించి 1500 రూపాయలు ఉన్న వేతనాన్ని 10 వేల రూపాయలకు తీసుకెళ్లిందని తెలిపారు.ఈనేపథ్యంలో వారికి సమూచిత స్థానం కల్పించి గౌరవంగా ఉండటానికి ప్రభుత్వ ఉద్యోగుల విధంగా ప్రతి పిఆర్సిలో జీతం పెరిగే విధంగా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రేవంత్ ప్రభుత్వం వారితో సర్వేల పేరుతో వెట్టి చాకిరి చేపించుకుంటూ డబ్బులు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లు ఎవరు అధైర్య పడద్దని వారికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని రాష్ట్ర మాజీ సివిల్ సప్లై చైర్మన్ బిఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మనోధైర్యాన్ని ఇచ్చారు.