ఓదెల (పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:
పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓదెల గ్రామ శివారు హరిపురం రోడ్డు వైపు కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై పోత్కపల్లి పోలీసులు వెళ్లి రైడ్ చేసి తొమ్మిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఏడు వేల ఒక వంద రూపాయలు,మూడు మొబైల్ ఫోన్లు, నాలుగు టూ వీలర్స్ మరియు పేక పత్తలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు.
పేకాట ఆడిన వారి వివరాలు
1 మంద కుమారస్వామి
2 రాచర్ల రమేష్
3 చెరుకు మహేష్
4 కొక్కుల రవీందర్
5 పెండెం సమ్మయ్య
6 పెండెమ్ లక్ష్మణ్
7 పసెడ్ల స్వామి. 8 పసెడ్ల సతీష్.9 గడ్డం యాదగిరి లు వీరందరిది ఓదెల గ్రామమే నని తెలిపారు.
ఈ సందర్భంగా పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ మాట్లాడుతూ గ్రామాలలో పేకాట, కోడి పందాలు ఆన్లైన్ బెట్టింగులు, క్రికెట్ బెట్టింగ్,బహిరంగ ప్రదేశంలో జూదం,మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే పోత్కపల్లి ఎస్ఐ నెంబర్ 8712656514, కు సమాచారం అందించాలని సూచించారు.చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ఎంతటి వారినైనా చట్టప్రకారం శిక్షించడం జరుగుతుందని ఎస్ఐ గారు హెచ్చరించినారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. .
ఇట్టి రైడ్ లో పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ గారితో పాటు, కానిస్టేబుల్ రాజేందర్, ప్రశాంత్, రామకృష్ణ లు పాల్గొన్నారు.