కవులు సమాజ అభివృద్ధి లో భాగం అవ్వాలి….

కవులు సమాజ అభివృద్ధి లో భాగం అవ్వాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా (జహీరాబాద్ నియోజకవర్గం ) జిల్లా కేంద్రమైన సంగారెడ్డి రిటైర్డ్ ఎంప్లయిస్ భవనంలో ప్రముఖ కవి విశ్రాంత ఉపాధ్యాయుడు డా. మహమ్మద్ షరిప్ రచించిన గరిసె కథల సంపుటి పుస్తకావిస్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఇది వరకే డాక్టర్ .మహమ్మద్ షరిప్ పద్యశతకాలను, కావ్యఖండాలను, వచనకవితలను, ఎన్నో పుస్తకాలను రచించారు. అందంలో భాగంగా గరిసె కథల సంపుటిని వైవిద్యమైన రీతిలో రచించి ఎందరి మన్నలను పొందరు. రిటైర్డ్ ఎంప్లాయిస్ భవనంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన సాహిత్య అభిమానులు, కవులు, భాషాప్రేమికుల మధ్యన ప్రముఖ అవధాని రచయిత డా. దోరవేటి చెన్నయ్య ఆద్వర్యంలో గరిసె పుస్తకావిష్కరణను నిర్వహించారు. ఆవిష్కరణ అనంతరం ప్రముడ రచయిత సమిక్షకుడు డాక్టర్. జయప్రకాశ్ గరిసె పుస్తకాన్ని గూర్చి సమీక్షిస్తూ అందులోని 18 కథలను గూర్చి సంక్షిప్తంగా తెలియపర్చారు.ఈ సందర్బంగా ప్రముఖ పద్యరచయిత నలవోలు నరసింహ రెడ్డి మాట్లాడుతూ షరిప్ గారి పుస్తకాన్ని గూర్చి తెలియజేస్తూ కవుల రచనలను గూర్చి గొప్పగా తెలియపరచరు. అలాగే కవిత్వం గురించి ఉదాహరణలతో కవులు ఏ విధంగా రచనలు చేయలో నూతనంగా కవిత్వం రాసే కవులకు రచయితలకు మార్గనిర్దేశం చేశారు. పలువురు వక్తలు షరిప్ రచనలను గురించి గొప్పగా పొగిడారు. ఈ కవి సమ్మేళనానికి జహీరాబాద్ ప్రాంత ప్రముఖ కవి రచయిత డాక్టర్. పెద్దగొల్ల నారాయణ, పి.ప్రభాకర్ల్ పాల్గొని తమ కవితలను గానం చేశారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న వక్తలందరికీ షరిప్ మరియు మిత్రబృందం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న కవులందరికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు, సాహిత్య అభిమానులు, భాషాప్రేమికులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version