
`వేలాది కుటుంబాలను ఆదుకున్న దేవుడే!
`వరికోల్‌ను సిరికోల్ చేసిన పెన్నిదే!
`అనాధలకు అన్నం పెడుతున్న బ్రహ్మ దేవుడే!
`యాభై వేల కుటుంబాలలో వెలుగులు నింపిన సూర్యుడే.
`మహిళా సాధికారిత కోసం కృషి చేసిన మహనీయుడే
`ఎంతో మంది యువతకు ఉపాది కల్పించిన విశ్వకర్మనే.
`గూడు లేని పేదలకు సొంతిళ్లు నిర్మించి ఇచ్చిన దర్మదాతే.
`ఎంతో మంది ఆరోగ్యాలను కాపాడిన వైద్యుడే.
`పార్టీ కోసం అహర్నిశలు పని చేస్తున్న సామాన్య కార్యకర్తే.
`కార్యకర్తలను కడుపులో పెట్డుకొని చూసుకుంటున్న నాయకుడే.
`ఆపదలో వున్న వారిని ఆదుకుంటున్న ఆపద్బాందవుడే.
`పార్టీ అప్పగించిన పనులను విజయవంతం చేస్తున్న అజేయుడే.
`అభాగ్యుల పాలిట వరదేవుడే.
`అన్నా అని గడప తొక్కితే ఆలస్యం చేయకుండా సాయమందించే ఆపన్న హస్తమే.
`పేదల చిరునవ్వుల్లో వెలుగుతున్న వేకువ వెలుగు శీనన్నే.
హైదరాబాద్,నేటిధాత్రి:
మానవత్వం చాటు కోవాలంటూ మాటలు వుంటే సరిపోదు. పేదలను ఆదుకోవాలనుకుంటే చెట్టుపేరు చెప్పుకుంటే సేవ చేసినట్లు కాదు. అందుకు మనసుండాలి. పేదల మీద ప్రేమ వుండాలి. తోటి సమాజం మీద కరుణ వుండాలి. మనతోటి సమాజంలో బతుకుతున్న వారికి చేయూతనందించాలన్న మంచి గుణముండాలి. వారి జీవితాలను వెలుగులోకి తేవాలన్న జిజ్ఞాస వుండాలి. అన్నం కోసం తపిస్తున్నవారికి ఆకలి తీర్చాలన్న దయ వుండాలి. ఇవన్నీ కావాలంటే గొప్పవ్యక్తిత్వముండాలి. ఇవన్నీ మెండుగా, నిండుగా వున్న నాయకుడు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి. సంపాదించుకున్న దానిని చూసి మురిసిపోయేవాళ్లుంటారు. దాచుకునే వాళ్లుంటారు. తాతల నాటి ఆస్ధులు కలిసొచ్చి అహం ప్రదర్శించేవాళ్లుంటారు. కాని తాను ఎంత ఎదిగినా ఒదిగి వుండే నాయకుడు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి. ప్రజల్లో తాను ఒకడుగా జీవించే దార్శనికుడు పోచంపల్లి. నిత్యం ప్రజలతో మమేకమై, వారికి కష్టసుఖాలు తీర్చుతూ వారికి చేదోడు వాదోడుగా వుండే మానవతా మూర్తి పోచంపల్లి. తాను సంపాదించిన సొమ్మును పది మందికి పంచి తృప్తి పొందే నాయకుడు పోచంపల్లి. ఎమ్మెల్సీ పోచంపల్లి చేసిన సాయాలు, దానాలు లెక్కలేనివి. నిజం చెప్పాలంటే ఆయన పుట్టకతోనే ఆగర్భ శ్రీమంతుడు. పుట్టుకతోనే సిరిసంపదలు కలిగిన సిరిమంతుడు. అంతే తప్ప ఆయన రాజకీయాలకు వచ్చి సంపాదించిందేమీ లేదు. రాజకీయాల వల్ల సంపాదించుకన్నది కాదు. కల్వకుంట్ల కవిత చేసిన పోచంపల్లిపై చేసిన వ్యాఖ్యల మూలంగా ఆయన అభిమానులు ఎంతో మంది చింతిస్తున్నారు. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కేవలం మాజీ ఎంపి. సంతోష్ స్నేహితుడు కావడమే ఆయనకు అదృష్టం కలిసొచ్చినట్లు చెప్పడం విడ్డూరం. సంతోష్ మూలంగానే రాజకీయాలలో అవకాశాలు అందిపుచ్చుకున్నాడని అది వారి బిక్షలాగా కవిత మాట్లాడడం సరైంది కాదు. సంతోష్ లేకుంటే పోచంపల్లి ఎవరు? అనే ప్రశ్న వేసే హక్కు కవితకు లేదు. ఎందుకంటే బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటిఆర్, సంతోష్, పోచంపల్లిలు ఒకే దగ్గర చదువుకున్న స్నేహితులు. అంతా మాత్రానా పోచంపల్లి ఎవరి మీద ఆధారపడి చదువుకోలేదు. కవిత చేసిన వ్యాఖ్యల్లో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి చదువుకోసం సంతోష్ మీద ఆధారపడినట్లు అర్ధమొచ్చేలా వుంది. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వంద ఎకరాల భూస్వామ్య కుటుంబం. అయినా ఆయన ఎక్కడా అలాంటి దర్పం ప్రదర్శించే నాయకుడు కాదు. పోచంపల్లి కుటుంబం ఎప్పటినుంచో ప్రజా సేవలో వుంది. పోచంపల్లికి తాతలనాడే వందల ఎకరాల భూములు కలిగివున్నారు. ఒక రకంగాచెప్పాలంటే ఆగర్భ శ్రీమంతులు. అలాంటి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఒకసామాన్య కుటుంబం నుంచి వ్యక్తికి ఇన్ని ఆస్ధులు ఎలా వచ్చాయి? అని కవిత ప్రశ్నించడం అవివేకం. శ్రీనివాస్‌రెడ్డి పుట్టిన ఊరు వరికోలు గ్రామంలో వున్న భూమిలో 24 ఎకరాలు పేదలు ఇండ్లు నిర్మాణం చేసుకోవడానికి దానం చేసిన గొప్ప మానవతా మూర్తి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి. తన సొంత డబ్బులతో తన ఊరిని బాగు చేసిన నాయకుడు. ఊరిలో ఏ అభివృద్ది పనిని అడిగినా పోచంపల్లి పేరే చెబుతుంది. తెలంగాణలో ఏ గ్రామంలో లేని విధంగా పంచాయితీ భవనాన్ని కార్పోరేట్ కార్యాలయంలా నిర్మాణం చేశాడు. చిన్న గ్రామమైనా సరే ఆ ఊరికి చెందిన వాళ్లు పెళ్లిళ్లు, పేరంటాలకు ఇతర గ్రామాలకు వెళ్లకుండా, పక్కనే వున్న పట్టణం వరకు వెళ్లకుండా అన్ని రకాల హంగులుతో కూడిన అద్భుతమైన ఫంక్షన్ హాల్ నిర్మాణం చేయించి ఇచ్చాడు. ఊరందరికీ ఉచితంగా ఎలాంటి ఫంక్షన్ అయినా చేసుకునే వీలు కల్పించాడు. చదువు విలువ తెలిసిన వ్యక్తిగా ఆయన ఎలా ఉన్నత చదువులు చదువుకున్నాడో అలాగే పేదలందరూ మంచి విద్యను అందుకోవాలన్న సదుద్దేశంతో పోచంపల్లి పౌండేషన్ ద్వారా ఎంతో మంది చదవుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేసిన విద్యా దాత పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. నిజం చెప్పాలంటే ఆయన చేసిన వ్యాపారాలలో వచ్చే ప్రతి రూపాయి ప్రజల కోసమే ఖర్చు చేస్తాడని చెప్పడంలో సందేహం లేదు. అటు వ్యాపార రంగంలో వెలుగుతూనే తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న నాయకుడు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి. కేవలం రాజకీయాల కోసం బిఆర్ఎస్లో చేరిన నాయకుడు కాదు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కేటిఆర్, సంతోష్‌లతో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకుడు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి. ఆపదలో వుండి సరైన వైద్యం చేయించుకోలేని ఎంతో మందికి ప్రాణాలు కాపాడిన ప్రాణదాత పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి. ఎంతోమందికి వైద్య సాయం అందించారు. పూర్తి వైద్య ఖర్చులు పెట్టుకొని ఎంతో మంది ప్రాణాలు కాపాడిన నాయకుడు పోచంపల్లి. తాను పుట్టిన ఊరునేకాదు, చుట్టుపక్కల అనేక గ్రామాలలో ఆయన చేసిన అభివృద్ది దర్శనమిస్తుంది. ప్రతి గ్రామంలో పోచంపల్లి చేసిన అభివృద్ది కనిపిస్తుంది. ఆయన సొంత నిధుల చేసిన అభివృద్ది పనులు అనేకం ఎదురొస్తాయి. ఆయన చేసిన అభివృద్ది అక్కడితో ఆగకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక మండలాలు, గ్రామాలలో పోచంపల్లి చేసిన అభివృద్ది కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ ఊరికి వెళ్లినా పోచంపల్లి వల్ల బాగుపడిన కుటుంబం ఒక్కటైనా వుంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతి గ్రామంలో పోచంపల్లి వల్ల లబ్ధి పొందిన కుటుంబం ఖచ్చితంగా వుంటుంది. అంత గొప్పది పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సేవా గుణం. ముఖ్యంగా జనగామ జిల్లాలో కూడ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అనేకం వున్నాయ. చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు లెక్కలేకుండా వున్నాయి. అలా ప్రజల గుండెల్లో వున్న నాయకుడు పోచంపల్లి. తెలంగాణలోనే ఎక్కడా లేని విధంగా రూ.5 కోట్లతో అత్యాధునిక హంగులతో వైకుంఠ దామాన్ని నిర్మాణం చేశారు. ప్రత్యేంగా ఆయన గుళ్లు గోపురాలకు చేసిన సేవ అంతా ఇంతా కాదు. ఇచ్చిన విరాళాలు అన్నీ ఇన్నీ కావు. ఏ ఊరులో గుడి కడుతున్నామని చెప్పినా సరే వెంటనే చందాలు ఇస్తుంటారు. పేరు ప్రఖ్యాతులతో విలసిల్లుతున్న దేవాయాల అభివృద్దికి ఇతోదిక నిధులు ఇచ్చిన నాయకుడు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి. జనగామ జిల్లా జీడికల్ దేవాలయ అభివృద్ది కోసం రెండు కోట్లిచ్చారు. ఇలా అనేక దేవాలయాల అభివృద్దికి లేదనకుండా నిదులిచ్చారు. ములుగు జిల్లా పాలంపేటలో వున్న రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తేవడంలో పోచంపల్లి ఎంతో కృషిచేశారు. ముఖ్యంగా మహిళలలో ఆర్ధిక స్వావలంబన కోసం పెద్దఎత్తున కుట్టు మిషన్లు పంచారు. నడిగూడ, దామెర మండలంతోపాటు, పరకాల అర్భన్‌లో పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా సుమారు 5వేల మందికి కుట్టు మిషన్లు అందించారు. ఒకప్పుడు వరికోల్గా పేరున్న గ్రామాన్ని ఇప్పుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఊరు అని గుర్తించేలా అభివృద్దిచేశారు. వరికోల్‌ను సిరికోల్ అనేంతగా గొప్పగా తీర్చిదిద్దారు. అంతే కాదు ఏ ఆదరణలేని ఎంతో మంది వృద్దులకు అన్నం పెడుతున్న పరబ్రహ్మ స్వరూపం పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి. పిల్లలు లేక చూసుకునే దిక్కులేక, పిల్లలుండి పట్టించుకోలేని వృద్దులెంతో మందికి ఆశ్రయం కల్పించి, వారికి నీడనిస్తున్న దేవుడు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి. ఒక్క పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మూలంగా యాబై వేల మంది కుటుంబాలలో వెలుగులు నిండాయంటే మాటలు కాదు. చేసిన సాయం కూడాఎవరికీ చెప్పుకునే మనస్తత్వం ఆయనకు లేదు. గుప్తదానాలను ఎడమ చేతికి తెలియకుండా, కుడి చేతితోఇచ్చేంత మనసున్న నాయకుడు పోచంపల్లి. మహిళా సాదికారిత కోసం ఆయన చేసిన సేవ ఎంతో గొప్పది. తనకు తెలిసిన ఎంతో మంది యువతకు ఉపాది కల్పించి వారి జీవితాలను నిలబెట్టిన దార్శనికుడు పోచంపల్లి. పార్టీ కోసం అహర్నిషలు కృషిచేస్తున్నాడు. కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాడు. ఏ కార్యకర్తకు చిన్న ఇబ్బంది వుందని తెలిసినా వెంటనే వారికి దైర్యంగా నిలబడతాడు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటే వైద్యసేవలు అందిస్తాడు. ఆర్దికపరమైన ఇబ్బందులుంటే ఆదుకుంటాడు. ఇలా కార్యకర్తలకు పెద్దన్నగా అండగా వుంటాడు. అలాంటి నాయకుడికి కవిత చీపురు పుల్లలా తీసేసినట్లు మాట్లాడడాన్ని బిఆర్ఎస్ శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి. పోచంపల్లి నిర్మాణాలు చేపట్టడం ఆయన వ్యాపారంలో ఒక భాగం. అది తప్పెలా అవుతుంది. దానిని కూడా తప్పు కవిత తప్పు పట్టడం ఆమెలోని అహానికి నిదర్శనం. నాయకులు ఎదరగాలని పార్టీ పెద్దలు కోరుకోవాలే గాని, ఎదుగుతున్నారని కుట్రలు చేయడం మాత్రం ఎవరికీ మంచిది కాదు.