PM-Kisan Funds to Be Released on 13th
రైతులకు గుడ్ న్యూస్
ఈ నెల 13న పీఎం కిసాన్ నిధులు:
భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ సురేష్ చింతకింది
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి. రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెట్టుబడి సాయం పథకం పీఎం- కిసాన్ నిధులు ఈ నెల 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 22వ విడత ఈ స్కీం నిధులను అసోంలోని గువాహటిలో ప్రధాని మోడీ రిలీజ్ చేయనున్నారు. ఈ పథకం ద్వారా దేశంలోని 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున డబ్బులు జమ కానున్నాయి. కాగా, పీఎం-కిసాన్ స్కీమ్‌ను 2019లో ఎన్డీయే ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతీ ఏడాది మూడు సార్లు రూ.2,000 చొప్పున రూ.6వేలు రైతుల ఖాతాల్లో కేంద్రం వేస్తున్నది. ఈ సారి రూ. 19 వేల కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. పత్రిక విలేకర్ల సమావేశం లో ఆయన మాట్లాడుతూ రైతుల పక్షాన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.
