సబ్ రిజిస్టర్, మున్సిపల్ కమిషనర్ పై కేసు నమోదు
జహీరాబాద్ నేటి ధాత్రి:
గతంలో భూ వివాదంలో నిబంధనలు పాటించకుండా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసిన అప్పటి సబ్ రిజిస్టర్ అబ్దుల్ హఫీజ్, మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు లపై కేసు నమోదు చేసినట్లు జహీరాబాద్ పట్టణ ఎస్సై వినయ్ కుమార్ బుధవారం తెలిపారు. 2018లో హైదరాబాద్ కు చెందిన వినోబా స్థానికులు నరసింహారెడ్డి, వేణు గోపాల్ తో కలిసి ఓ వెంచర్ ఏర్పాటు చేశారు. తనను మోసం చేశారని భూ యజమాని ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
