
students.Department ..
విద్యార్థులకు మాదకద్రవ్యాల నిషేధంపై ప్రతిజ్ఞ.
చిట్యాల, నేటి ధాత్రి :
చిట్యాల మండల కేంద్రంలో ఉన్న ఆదర్శ పాఠశాల కళాశాల (మోడల్ స్కూల్లో )డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిక్ అండ్ ఎంపవర్మెంట్ ఆదేశానుసారము * నషా ముక్తి భారత్ అభియాన్*
కార్యక్రమంలో భాగంగా పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ మేకల రమేష్ సమక్షంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వాసాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ*
కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమంలో పాఠశాల కళాశాల పిల్లల తోటి వెంకటేశ్వర్లు
నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతోపాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా చూస్తానని డ్రగ్స్ అమ్మకము కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామినీ అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను
అని ప్రతిజ్ఞ చేయించారు
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.