Anti-Drug Pledge at Chevella Municipality
మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ
* చేవెళ్ల మున్సిపల్ కార్యాలయంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ
* పురపాలక సిబ్బందితోపాటు మహిళసంఘాల సభ్యులతో
కమిషనర్ వెంకటేశం ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ
చేవెళ్ల, నేటిధాత్రి:
చేవెళ్ల మున్సిపల్ కార్యాలయంలో మాదకద్రవ్యాల నిరోధక
ప్రతిజ్ఞ చేశారు. నషా ముక్త్ భరత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మిన్ (సి. డి. ఎం.) డాక్టర్. టి. కే. శ్రీదేవి, ఆదేశాల మేరకు చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ ఎస్. వెంకటేశం మంగళవారం మున్సిపల్ సిబ్బందితోపాటు, మండల మహిళా సంఘాల సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు. తమ పరిసరాలలో మాదక ద్రవ్యాల వినియోగం జరిగితే పోలీస్ యంత్రాంగానికి సమాచారం ఇచ్చి సమాజ రక్షణకు తోడ్పతామని, డ్రగ్స్ రహిత పోరాటంలో క్రియాశీల భాగస్వాములమవుతామని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతానని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకటేశం, మేనేజర్ రాఘవేందర్, అమరేందర్ రెడ్డి మున్సిపల్ పట్టణ వార్డ్ ఆఫీసర్లు, మహిళా సంఘ సభ్యులు స్వరూప, తదితరులు పాల్గొన్నారు.
