సిరిసిల్ల(నేటి ధాత్రి):
ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా చెట్లను నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే కంపల్లి సత్యనారాయణ అన్నారు. ఇల్లంతకుంట మండలంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ మొక్కలు మానవజీవకోటికి ప్రాణాధారం అని అందువల్ల ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో 500 రకాల వివిధ పండ్ల మొక్కలతో ఏర్పాటు చేసిన తోటను జిల్లా ఎస్పీతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య. డిఎస్పి వి చంద్రశేఖర్ రెడ్డి, సిఐ మొగిలి ఎస్సై శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మొక్కలను నాటి సంరక్షించాలి
