మిల్స్ కాలని సీ.ఐ మల్లయ్య
నేటిధాత్రి, వరంగల్
మానవ మనుగడకు వృక్షాలే ఆధారమని మిల్స్ కాలని సీఐ మల్లయ్య అన్నారు. ఖిలా వరంగల్ మండలం తూర్పు కోటలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, ఇందిరా వనప్రభ కార్యక్రమంలో భాగంగా కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ… గ్లోబల్ వార్మింగ్, వాతావరణ కాలుష్య నియంత్రణ వన సంపదతోనే సాధ్యమని వెల్లడించారు. స్వచ్ఛమైన వాయువునిచ్చి ఆక్సిజన్ అందించే చెట్లను కాపాడుకోవాలని అన్నారు. వాతావరణం సమతుల్యత సాధించాలంటే విరివిగా మొక్కలు పెంచాలని పేర్కొన్నారు. నాటిన ప్రతి మొక్కను చంటి పాపలా పెంచి పోషించాలని సూచించారు. కార్యక్రమంలో టింలీడర్ జూపాక శివ, కళాకారులు మారుముల్ల ఆనందం, రామంచ భారత్, హింగే అరవింద్ కుమార్, కందకట్ల రామకృష్ణ, అంకం రామనాథం, ఎలబోయిన రాజు, ఇల్లందుల సతీష్, ఈటెల సమ్మన్న, గుగులోతు శాలిని, మాటేటి అనిత, మైదం ఝాన్సీ , మేకల విజయ, జడల హరిత తదితరులు పాల్గొన్నారు.