మహబూబాబాద్,నేటిధాత్రి:
ప్రభుత్వ స్థలాలలో నిర్మించుకున్న 125 గజాలలోపు ఇండ్ల స్థలాలను ఉచితంగా క్రమబద్దీకరణ చేపట్టేందుకు జి.ఓ.58 ఉత్తర్వులు జారిచేసినందున అధికారులు పర్యవేక్షించి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.బుధవారం ఐ.డి.ఓ.సి.లోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఉత్తర్వులు 58 క్రింద చేపడుతున్న ఉచిత క్రమబద్దీకరణ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న నిరుపేద కుటుంబాల వివరాలు నమోదు చేస్తూ నివేదిక అందజేయాలన్నారు.స్థలాల వివరాల నివేదిక కొరకు వాస్తవ సమాచారం సేకరించేందుకు అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలన్నారు.మహబూబాబాద్ లో 2 వేలకు పైగా ఉన్నాయని,కేసముద్రం,తొర్రుర్ లలో400 చొప్పున ఉన్నాయన్నారు.జిల్లా అధికారులు రెవిన్యూ అధికారులు,సర్వే అధికారులతో బృందం గా ఏర్పడి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.