
వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బుధవారం వేములవాడ పట్టణానికి చెందిన పిట్టల అంజలిని వేములవాడ పట్టణ మహిళ ఉపాధ్యక్షురాలుగా నియామకం చేయడం జరిగింది. నియామక పత్రాన్ని పట్టణ మహిళా అధ్యక్షురాలు తోట లహరి అందజేశారు. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సహాయ శక్తుల కృషి చేస్తానని ఆమె అన్నారు. రానున్న పార్లమెంటు స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడతాననిఆమె అన్నారు. రాహుల్ గాంధీ ని ప్రధాని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆమె అన్నారు. నా నియామకానికి సహకరించిన రవాణా శాఖ మంత్రి పొన్నo ప్రభాకర్ కి, ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పాత సత్యలక్ష్మి కి, పట్టణ మహిళా అధ్యక్షురాలు తోటలహరి కి, పట్టణ, బ్లాక్ అద్యక్షులు సాగరం వెంకటస్వామి, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, చిలుక రమేష్, సంఘ స్వామి యాదవ్, కూరగాయల కొమరయ్య, కనికరపు రాకేష్, తుమ్ మధు, నాగుల రాము గౌడ్ గార్లకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేశారు.