వందపడకల హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలి.
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి లోని వంద పడకల హాస్పిటల్ లో డాక్టర్ల నిర్లక్ష్యంపై వేంటనే చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ తోపాటు మెడికల్ కాలేజ్ కాలేజి ప్రిన్సిఫల్ కి ఫిర్యాదు చేసిన పిప్పాల రాజేందర్ అనంతరం మాట్లాడుతూ
మా అక్క అయిన సాగి స్వరూప ట్రిట్మెంట్ విషయంలో 100 పడకల హాస్పిటల్లోని డాక్టర్లు నిర్లక్ష్యం వహించడంతో ప్రాణపాయ స్థితిలోకి వెళ్లిపోయిన మా అక్క స్వరూప తండ్రి.సర్వేశం, గ్రామం కొంపెల్లి, మండలం భూపాలపల్లికి సాగి స్వరూపకు తీవ్ర గాయాలై భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 100 పడకల హాస్పిటల్లో 10వ తారీఖు బుధవారం రోజున జాయిన్ కావడం జరిగింది. హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుండి శ్వాస ఆడడం లేదని విపరీతంగా తలనొప్పి లేస్తుందని బెడ్పై పడుకోలేక పోతున్నానని డాక్టర్లకు విన్నవించుకున్నప్పటికి కూడా డాక్టర్లు పట్టించుకున్న పాపాన పోలేదు. వెంటనే ఇట్టి విషయంపై హాస్పిటల్ సూపరింటెండెంట్ అయిన డాక్టర్ నవీన్ కుమార్ కి పలుమార్లు ఫోన్ చేసినప్పటికి కూడా మీ అక్క కి నార్మల్గానే ఉంది జస్ట్ చాతి నొప్పే ఇబ్బంది ఏమి లేదని నాకు చెప్పడం జరిగింది. డిశ్చార్జి చేయవచ్చు అని కూడా చెప్పి, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని తేది: 14.07.2024 ఆదివారం రోజున డిశ్చార్జి చేయడం జరిగింది. మేము మా అక్కను ఇంటికి తీసుకవెళ్ళిన తరువాత మా అక్క తీవ్ర ఇబ్బంది పడుతుంటే హన్మకొండలోని గుడ్లైఫ్ హాస్పిటల్ కి తీసుకవెళ్ళి డాక్టర్లకు చూపించగా వారు ఎక్స్రే, స్కానింగ్ చేసి నాలుగు పక్క బొక్కలు విరిగి బ్లెడ్ బ్లీడింగ్ అయి ఇన్ఫెక్షన్ అయిందని పేషెంటు కండిషన్ ఇంత సీరియస్గా ఉన్నప్పటికి ఎందుకు హాస్పిటల్లో చూపించలేదని మాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అక్క పరిస్థితి ఇంత సీరియస్గా ఉన్నదని హాస్పిటల్కి పోయేంత వరకు మాకు తెలియదు.
కానీ మా అక్క ఇంత సీరియస్ కండిషన్లో ఉన్నప్పటికి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 100 పడకల హాస్పిటల్లోని డాక్టర్లు (5) రోజులు హాస్పిటల్లో ఉంచుకొని ఎలాంటి వైద్యం చేయకుండా వైద్యం చేస్తున్నట్టు నటిస్తూ పూర్తిగా నయం అయిందని ఇంటికి పంపించినారు.
కావున మా అక్కకు అందించిన వైద్యం విషయంలో 100 పడకల హాస్పిటల్లోని డాక్టర్లు సూపరింటెండెంట్ డాక్టర్ నవీన కుమార్ నిర్లక్ష్యం వహించడంతో ఇప్పుడు మా అక్క చావు బ్రతుకుల మధ్య కొట్టు మిట్టాడుతుంది.
కావున ఈ సంఘటనకు బాధ్యులైన డాక్టర్లపై హాస్పిటల్ సూపరింటెండెంట్పై తక్షణమే విచారణ చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ ను కోరుతున్నాం