గులాబీమయమైన గ్రామవీదులు..
200 బైకులతో రమణన్న ర్యాలీ…
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను ఈనెల 27న నిర్వహించడం జరుగుతుందని కార్యకర్తలందరూ వేడుకను జయప్రదం చేయాలని భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలలో. కార్యకర్తలతో కలసి బైక్ ర్యాలీని నిర్వహించగా ఆయా గ్రామాలన్నీ పండుగ వాతావరణాన్ని సంచరించుకునేలా గులాబీమయంగా. మారింది. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఘనంగా స్వాగతం పలికిన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు. రంగాపురం గ్రామం నుండి ఆకినపల్లి గ్రామం వరకు దాదాపు 15 కిలోమీటర్లు 200 బైకులతో మొగుళ్ళపల్లి మండల గ్రామాల్లో ర్యాలీ తీస్తూ పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ బి ఆర్ఎస్ పార్టీ పైన ప్రజలుకు ఎంతగానో ఆదరణ ఉందన్నారు