*పరకాలలో గులాబీ జెండా ఎగరడం ఖాయం*
*చల్లా ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే*
*పరకాల,నేటిధాత్రి*
మున్సిపల్ ఎన్నికల్లో పరకాల గడ్డపై గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధీమా అన్నారు.పట్టణంలోని 4వ, 16వ వార్డులకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఆ పార్టీ విధానాలపై తీవ్ర అసంతృప్తితో తమ పదవులకు రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీలో చేరారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఏకు రమేష్, మోరే రాజకుమార్, గోవిందు రాజేందర్, మోరే సారంగపాణి, బొచ్చు దేవరాజు, గోవింద రాజు, పసుల పవన్ కళ్యాణ్, కోగిల శ్రీకాంత్, గోవింద అజయ్, నిశాంత్ లకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.అనంతరం మాట్లాడుతూ ప్రజల సమస్యలపై పోరాటం చేయలేని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి,తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న బిఆర్ఎస్ పార్టీలో చేరడం అభినందనీయమని బిఆర్ఎస్ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు,తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని పరకాల అభివృద్ధి,ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు, నాయకత్వ లోపాలు,స్థానిక సమస్యలపై నిర్లక్ష్య వైఖరి కారణంగానే పార్టీని వీడుతున్నామని,బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే తమను ఆకర్షించాయని పార్టీలో చేరిన నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, యూత్ నాయకులు పాల్గొన్నారు.
