బీఆర్ఎస్ పార్టీలోకి భారీ గా చేరికలు
మంగపేట-నేటిధాత్రి
మంగపేట మండలం రాజుపేట గ్రామం రైస్ మిల్ దగ్గర ఏర్పాటు చేసిన బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో అభ్యర్థి ప్రచారం షెడ్యూల్ వివరిస్తున్న మెట్టు శ్రీనివాస్ (టి ఎస్ ఆర్ డి సి) చైర్మన్ మంగపేట మండలం రాజుపేట గ్రామానికి చెందిన 20 మంది పైగా కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ను వీడిన వారిని బీఆర్ఎస్ పార్టీలోకీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మెట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు అని కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారు
దేశంలో వేరే రాష్టలలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీల నుండి ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారు మరి ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరహా లో ఏ ఒక్క సంక్షేమ పథకాలను ఇవ్వడం లేదు ఇలా ఐతే
మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎలా పతకాలను అమలు చేస్తారు అని ప్రజలు నమ్ముతారు?అని ప్రశ్నించారు.
ఏ రాష్ట్రలలో అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసి చూపించారూ అని వారు హితోపలికారు
బడే నాగజ్యోతి కి ఓటు వేసి నాగజ్యోతిని దీవించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ, క్లస్టర్ ఇంచార్జ్ లు, వత్సవాయి శ్రీధర్ వర్మ, పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్,ఎడ్లపెల్లి నర్సింహారావు, కొమరం రాంమూర్తి,బడిశా నాగరమేష్ ఈ క్లస్టర్ లో ,అన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు,యూత్ నాయకులు, మహిళలు,బూత్ ఇంచార్జీలు సోషల్ మీడియా ఇంచార్జులు పాల్గొన్నారు.