కామారెడ్డి జిల్లా /పిట్లం నేటిధాత్రి :
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని భవిత సెంటర్లో శుక్రవారం ఫిజియో థెరపిస్ట్ డాక్టర్ సారిక ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఫిజియో థెరపీ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు 8 మంది విద్యార్థులకు గాను పరీక్షలు నిర్వహించారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
దివ్యాంగులకు ఫిజియోథెరపీ చేయడం వల్ల చాలా లాభాలున్నాయని, ఇది శారీరక శక్తి మరియు చలనం మెరుగుపరచడం ద్వారా వారి రోజువారీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనే అవకాశాన్ని ఇస్తుందని,అలాగే శరీరంలోని నొప్పి తగ్గించడం, సంయుక్త పునరుద్ధరణ, మరియు శారీరక సమతుల్యతను మెరుగుపరచడంలో ఫిజియోథెరపీ కీలక పాత్ర పోషిస్తుంది అని వివరించారు. కావున ప్రతి ఒక్క విద్యార్థి ఇంటి వద్ద తప్పకుండా వ్యాయామాలు చేయాలని వారిని సూచించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల ఉపాధ్యాయులు కమల్ కిషోర్, గంగాధర్, అంబయ్య, తదితరులు పాల్గొన్నారు.