Karthik Goud Joins State Executive
రాష్ట్ర కార్యవర్గంలోకి ఫోటోగ్రాఫర్ మండ కార్తీక్ గౌడ్ కు చోటు.
నర్సంపేట,నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ కార్యవర్గంలో నర్సంపేట డివిజన్‌కు చెందిన ఫోటోగ్రాఫర్ మండ కార్తీక్ గౌడ్‌కు చోటు దక్కింది.రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా కమిటీ అనుమతి మేరకు రాష్ట్ర అధ్యక్షులు మరియు రాష్ట్ర కమిటీ సభ్యుల చేతుల మీదుగా మండ కార్తీక్ గౌడ్‌కు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియామక పత్రాన్ని అందజేశారు.మండ కార్తీక్ గౌడ్ గతంలో చేన్నారావుపేట మండల ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షులుగా, నర్సంపేట డివిజన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, గత రెండు సంవత్సరాలుగా జిల్లా కార్యవర్గ సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారు. ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి చేసిన సేవలను గుర్తించిన రాష్ట్ర సంఘం, జిల్లా సంఘం అనుమతితో రాష్ట్ర కార్యవర్గంలోకి అవకాశం కల్పించింది.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గంలోకి చోటు కల్పించిన రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల ఫోటోగ్రాఫర్లకు మండ కార్తీక్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఫోటోగ్రాఫర్ల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు.
