50% సీలింగ్ రిజర్వేషన్ల జీవో పత్రాలను దహనం చేసిన బీసీ సంఘం నాయకులు
మంచిర్యాల,నేటి ధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 50 శాతం రిజర్వేషన్ తగ్గకుండా విడుదల చేసిన జీవోను పత్రాలను బీసీ నాయకులు శనివారం దహనం చేశారు.ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ సభ పేరుతో బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి బీసీలను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు సంవత్సరాల కాలం అవుతున్న స్పష్టమైన వైఖరి లేకపోవడం బాధాకరం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టిన ఏ ఒక్క అంశాన్ని పరిష్కరించిన పాపాన పోలేదన్నారు.ప్రజలని మభ్యపెట్టి మోసం చేయడం జరిగిందని,అలాగే కేంద్ర ప్రభుత్వం బీసీల పక్షపాతి అని చెప్పుకునే బిజెపి 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడంలో నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందన్నారు.ఈ రెండు పార్టీలు ధోరణిని విడనాడి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కాంగ్రెస్, బిజెపి పార్టీలను డిమాండ్ చేస్తున్నాం.లేని పక్షంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పక తప్పదు అలాగే బిజెపి వైఖరిని తీసి సమాజం ముందు ఎండగట్టి బిజెపిని బీసీ ల ముందు దోషిగా నిలబెట్టక తప్పదని హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో
జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్,రాష్ట్ర నాయకులు గజెల్లి వెంకన్న, శాఖ పూరి భీమ్సేన్,చంద్రగిరి చంద్రమౌళి,కర్రె లచ్చన్న, వేముల అశోక్,కీర్తి బిక్షపతి, మంచిర్ల సదానందం,తన్నీరు భీమ్రావు తదితరులు పాల్గొన్నారు.
