ఇది నిజాం కాలం నాటి రైల్వేస్టేషన్
ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటిదాత్రి:
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలంలోని పొత్కపల్లి రైల్వే స్టేషన్ లో పలు రైళ్ల హాల్టింగ్ కొరకు రూపు నారాయణపేటకు చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి నస్కూరి రామస్వామి రైల్వే ఉన్నత అధికారులకు వినతి పత్రం అందజేశాడు.కరీంనగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, తిరుపతి ఎక్స్ప్రెస్, కాగజ్నగర్ ఎక్స్ప్రెస్, ఇలా కాజీపేట టు బల్లర్ష, బల్లర్ష టు సికింద్రాబాద్ వెళ్లే ప్రతి రైలు కొత్తపల్లి రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఉండాలని పలుమార్లు వివిధ ఉన్నత అధికారులకు ప్రజాప్రతినిలకు వినతి వినతి పత్రం అందజేశారు. దాదాపుగా రోజు ఇక్కడి నుండి 20వేల పైగా మంది ప్రయాణిస్తూ ఉంటారు.పొత్కపల్లి నుండి 30 కిలోమీటర్ ల దూరంలో పెద్దపల్లి జంక్షన్,జమ్మికుంట స్టేషన్ లు కలవు కానీ దూరం ప్రయాణం చేయలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.పోత్కపల్లి నుండి అరగంట కో బస్సు,సుమారు 30 ఆటో లు టాటా మ్యాజిక్ ల సౌకర్యం మరియు పోలీస్ స్టేషన్,ప్రభుత్వ పాఠశాల, సహకార బ్యాంకు యూనియన్ బ్యాంకు, రైస్ మిల్లులు మెడికల్ స్టోర్లు, ఆయుర్వేదిక్ వైద్యశాల పెట్రోల్ పంపు మొదలగు సౌకర్యాలు కలవు ఇది నిజాం కాలం నాటి రైల్వే స్టేషన్ ఒకప్పుడు ఇక్కడ లోడింగ్ పాయింట్ కూడా ఉండేది కావున పోత్కపల్లి రైల్వే స్టేషన్ లో అన్ని ట్రైన్ల ఆల్టింగ్ అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నస్పూరి రామస్వామి వేముల శీను కుమార్ తదితరులు పాల్గొన్నారు.