టిఏజిఎస్ .జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య డిమాండ్
భద్రాచలం నేటిదాత్ర
ఈరోజు తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కి చర్ల మండలం సత్యనారాయణపురం గ్రామం సంబంధించిన 180 కుటుంబాలు సుమారు 500 ఎకరాల సాగులో ఉన్నాయని ఆదివాసీ పోడు రైతులు మాకు పట్టాలు అయితే వచ్చాయి గాని సరైన పంటలు వేసుకోవడానికి సాగు నీరు అందించడానికి అవకాశం లేదని ఆ భూములకు వ్యవసాయ బోర్లు మరియు త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని. ఐటీడీఏ పీవో కి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని. ఆకాశం మీద ఆధారపడి పత్తి. మిర్చి వేస్తున్నాం అని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య మాట్లాడుతూ డిమాండ్ చేశారు, అదేవిధంగా త్రీఫేస్ కరెంట్ సౌకర్యం. వ్యవసాయ బోర్లు పర్మిషన్ మీ గ్రామపంచాయతీలో గ్రామసభ జరిపి మీ సమస్యను పరిష్కారం చేస్తానని ఐటీడీఏ పీవో రాహుల్ హామీ ఇచ్చారు, అదేవిధంగా కారం మాట్లాడుతూ చర్ల మండలం విజయ్ కాలనీ సంబంధించిన ఆదివాసి రైతులు రెవెన్యూ పట్టాలు 23 మందికి ఉన్నాయి కానీ సొంతంగా వ్యవసాయ బోర్లు మరియు త్రీఫేస్ విద్యుత్ లైన్ కు డిడి కట్టి ఎంత స్తోమత లేని కారణంగా తమరి మాకు మా భూములకు పంట బోర్లు త్రి ఫేస్ కరెంటు పిచ్చి మమ్మల్ని ఆదుకోగలరని ఆ ఆదివాసి మహిళా రైతులు పివో కోరారు, సానుకూలంగా స్పందించి ఈ సమస్యను పరిష్కరిస్తాం అని అన్నారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు టీఏజీఎస్ భద్రాచలం పట్టణ కార్యదర్శి కుంజా శ్రీను, చర్ల మండలం ఐద్వా మండల కార్యదర్శి పొడుపుగంటి సమ్మక్క, ఆదివాసి రైతులు శ్యామల కాంతయ్య, పర్శిక రామ్ కిరణ్, గట్టుపల్లి సురేష్, సోడి నాగమణి ,సోయం రవి, కారం మహేష్, తెల్లం నాగేశ్వరావు, తుర్రం సమ్మక్క ఇంకా తదితరులు పాల్గొన్నారు