Farmers Demand Fix for Cotton Purchase Issues
పత్తి రైతుల సమస్యను పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం
మందమర్రి మండలంలోని రైతులు ఐక్యంగా రైతు వేదికను సందర్శించి, కౌలు రైతుల సంక్షేమం కోసం అధికారులతో విస్తృతంగా సమావేశమయ్యారు.
రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కాపస్ కిసాన్ యాప్ కారణంగా రైతులు అనేక సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, పత్తి కొనుగోలు ప్రక్రియలో ఆలస్యాలు అవరోధాలు ఏర్పడుతున్నాయని రైతులు వివరించారు.
ప్రస్తుతం యాప్ ఆధారంగా కేవలం 7 క్వింటాళ్ల వరకు మాత్రమే పత్తిని కొనుగోలు చేయడం రైతులకు భారీ నష్టాన్ని కలిగిస్తోందని, రైతుల వాస్తవ ఉత్పత్తి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పరిమితిని 12 క్వింటాళ్ల వరకు పెంచాలని రైతులు అధికారులు ముందు వినతిపత్రం ద్వారా అధికారికంగా కోరారు. చిన్న, మధ్య తరహా కౌలు రైతులు యాప్ లోపాల వల్ల ఆర్థికంగా ఇబ్బందులలో పడుతున్నారనీ, ప్రభుత్వం రైతుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని వారు అభ్యర్థించారు.
ఈ సమావేశంలో రైతులు తమ సమస్యలను స్పష్టంగా వివరించడమే కాకుండా, పత్తి కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలను మెరుగుపరచడం, తూకం చర్యల్లో పారదర్శకత, చెల్లింపుల్లో వేగం వంటి అంశాలను కూడా ఉటంకించారు. రైతుల ఏకగ్రీవ అభిప్రాయం ఏమిటంటే కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలి.
ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు రైతు నాయకులు, సంఘ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని ఐక్యంగా తమ మద్దతు తెలిపారు. రైతుల ఆశాభావం ఏమిటంటే, ఈ వినతి పత్రం ద్వారా వచ్చిన అంశాలను అధికారులు ప్రాధాన్యంగా పరిగణించి తగిన చర్యలు తీసుకుని రైతుల ను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు.
