
లక్షెట్టిపేట్ (మంచిర్యాల) నేటిధాత్రి :
లక్షేటిపెట్ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాలకు పర్మిషన్ ఇవ్వకుడదని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ పట్టణంలో కనీస సౌకర్యాలు లేకుండా సినిమా టాకీస్ పక్కన , చెరువులో ఏర్పాటు చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాలకు పర్మిషన్ ఇవ్వకూడదని అన్నారు.ఇట్టి పాఠశాలకు పర్మిషన్ ఇస్తే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో చిప్పకుర్తి శ్రీనివాస్ టి వి యూ వి రాష్ట్ర కార్యదర్శి, జుమ్మిడి గోపాల్, ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,
SK సల్మాన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు,
బచ్చలి ప్రవీణ్, వి జె ఎస్ జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.