మీ భద్రత మా పోలీస్ వారి బాధ్యత
సీఐ రంజిత్ రావు
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం లోని ప్రజలు మేడారం జాతరకు వెళ్లే సమయం లో వారి ఇంటికి తాళాలు వేసి వెళ్తారు కనుక అట్టి సందర్భంలో ఇంటిలో చోరీ జరిగే అవకాశాలు ఉన్నందున జాతరకు వెళ్లే ముందు పోలీస్ స్టేషన్ నందు సమాచారం ఇచ్చి వెళ్లగలరు.విలువైన వస్తువులను జాగ్రత్తగా బద్ర పరుచుకోగలరు.మరియు మీ ఇంటి పక్కన ఉన్న వారిని మీ ఇల్లును గమనించమని చెప్పవలెను.మీరు లేని సమయం లో మీ ఇంటి వద్ద చోరీ జరిగినట్లు మీకు తెలిసినట్లుయితే డయల్ 100 కి ఫోన్ చేసి వివరాలు తెలుపగలరు.గ్రామాలల్లో కొత్త వ్యక్తులు(అనుమానిత ) సంచరించినట్లయితే సమాచారం ఇవ్వగలరు.వేగం కన్నా ప్రాణం మిన్న కావున మీరు వెళ్లే వాహన డ్రైవర్లకి వాహనాన్ని నిదానంగా వెళ్ళమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.