భూభారతి చట్టంతోభూ సమస్యలకు శాశ్వత పరిష్కారం.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికను మంగళవారం రోజున భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం వల్ల రైతులకు ఎంతో ఉపయోగం ఉందని.పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ధరణి వంటి చట్టాలు దరిద్రంగా మారిందని, ధరణితో అధికారులకి.. అధికారాలు లేకుండా పోయాయన్నారు. ధరణి వల్ల ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు భూభారతి చట్టం ద్వారా మోక్షం లభిస్తుందని, కొత్త చట్టంలో సమస్యలపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో కలిపి భూభారతిని తీసుకొచ్చారన్నారు. భూ భారతి చట్టం ప్రకారం.. భూ సంబంధిత సమస్యలను నిర్దిష్ట గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని, సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోవచ్చని, ఈ చట్టంలో కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

ధరణిలో రెవెన్యూ కోర్టులను తొలగించడం వల్ల భూ వివాదాల విషయంలో రైతులు సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని గుర్తు చేశారు. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రస్తుత భూభారతి చట్టం ద్వారా గతంలో మాదిరిగా రెవెన్యూ కోర్టులు పునరుద్ధరించిందని వివరించారు. భూ సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునేందుకు తహసీల్దార్ రెవెన్యూ డివిజన్ అధికారికి, కలెక్టర్‌కు అధికారాలు కల్పించామని తెలిపారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు భావిస్తే అప్పీల్ చేసుకోవచ్చని సూచించారు. ఆర్థిక స్థోమత లేని పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం కూడా ప్రస్తుత చట్టంలో సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అదనపు కలెక్టర్ అశో,క్ డి ఆర్ డి ఎ పి డి నరేష్, తాసిల్దార్ హేమ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, జిల్లా అధికారులు మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి కాంగ్రెస్ నాయకులు దొడ్డికిష్టయ్య బుర్ర లక్ష్మణ్ గౌడ్, మధు వంశీకృష్ణ రైతులు తదితరులు పాల్గొన్నారు.