ఈరోజు మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌరవ అధ్యక్షులు పెరిమెల్ల పెళ్లి వెంకటేశ్వరరావు సంతాప సభను ఏర్పాటు చేయడం జరిగింది
భద్రాచలం నేటి ధాత్రి
రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు భూషణ్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంమాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు దాసరి శేఖర్ మాట్లాడుతూ హెల్త్ డిపార్ట్మెంట్లో వెంకటేశ్వరరావు ఉద్యోగం చేసుకుంటూ మాలల హక్కులకై మాల ఉద్యోగస్తులు ఏకం చేసి ఒక తాటిపై నడిపించిన ఘనత వెంకటేశ్వరరావు కి దక్కిందని మరియు రిటైర్డ్ అయిపోయినంక మాలమహాలలోకి వచ్చి గౌరవ అధ్యక్షుడిగా ఎన్నో సలహాలు సందేశాలు ఇచ్చి మాల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఆయనేనని అన్నారు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడిగా పని చేశారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరు కూడా ఎన్నో సేవలు అందించిన ఘనత వెంకటేశ్వరరావు కి దక్కిందని ఈ సందర్భంగా కొనియాడారు ఇట్లాంటి నాయకుడిని కోల్పోవడం మాల మహానాడు కి తీరనిలోటని ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబానికి మాల మహానాడు జిల్లా కమిటీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది ఈ సందర్భంగా దాసరి శేఖర్ అన్నారు ఈ కార్యక్రమంలో రిటార్డు ఉద్యోగ సంఘం అధ్యక్షులు భూషణ్ రావు మానవ హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ శ్రీనివాస్ పల్నాటి రాజేశ్వరరావు బతుకు మూడు రాజు జెట్టి రాము జి వెంకన్న కాపుల శేఖర్ ముత్యాలు రమాబాయి సుజాత రమణ కిట్టు తదితరులు పాల్గొన్నారు