స్వీయ తప్పిదాలతో మరింత దిగజారుతున్న కాంగ్రెస్ పలుకుబడి
ఏడాదిలో పుంజుకున్న బీజేపీ
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి మెజారిటీ ఖాయం
ఎన్డీఏ కూటమి సీట్లు 353కు పెరిగే అవకాశం
ఇండీ కూటమి 188కే పరిమితవవచ్చన్న సర్వే
99 నుంచి 78కి పడిపోనున్న కాంగ్రెస్ బలం
తమిళనాడులో బీజేపీ ఇంకా ఖాతా తెరవలేకపోవచ్చు
డీఎంకేదే హవా
ఒరిస్సాలో నవీన్ పట్నాయక్‌కే ప్రజల మద్దతు
ఉత్తరప్రదేశ్‌లో పుంజుకోనున్న ఎన్డీఏ
బిహార్‌లో కూటమిదే అధికారం
తేల్చిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే
హైదరాబాద్,నేటిధాత్రి:
ఎన్నికల్లో ప్రజల మూడ్ ఏవిధంగా వుంటుందనేది ఆ సమయానికి చోటుచేసుకున్న పరిణామాలు, స్థానిక, జాతీయ సమస్యలపై ఆధారపడివుంటుంది. అది కూడా ఒక్కో రాష్ట్రంలోని పరిస్థితులు కూడా ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల దేశం మొత్తంమీద ప్రజల్లో ఒకేరకమైన మూడ్ వుంటుందని చెప్పడానికి వీల్లేదు. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అవి స్థానిక సమస్యలు, భావోద్వేగాలను రెచ్చగొట్టి అధికారాన్ని హస్తగతం చేసుకునే వ్యూహాల ను అనుసరిస్తాయి. జాతీయ ఎన్నికల్లో తామే కింగ్‌మేకర్‌గా వుండి, కేంద్రంలో అధికారంలో ఉ న్న ప్రభుత్వాన్ని తమ కనుసన్నల్లో వుంచుకోవాలన్న దృక్పథం కూడా వాటికి వుంటుంది. ఇవి సంకీర్ణ ప్రభుత్వాలకు దారితీసి కేంద్ర ప్రభుత్వం బలహీనంగా మారిన సంవత్సరాలు కూడా మనం చూశాం. దేశ స్వాతంత్య్రం వచ్చినదగ్గరినుంచి ఛరిష్మా వున్న నాయకులపై ఆధారపడి రాజకీయ పార్టీల మనుగడ సాగిందనేది సుస్పష్టం. నెహ్రూ, ఇందిరాగాంధీలు ఏకఛత్రాధిపత్యంగా కాంగ్రెస్‌ను అధికారంలో నిలిపారు. వారి తర్వాత కేంద్రంలో అంతటి ఛరిష్మా వున్న నాయకులులేకపోవడంతో ఇతర పార్టీల మద్దతో ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. కానీ కలగూరగంప లాంటి పార్టీల సహకారం నేపథ్యంలో మన విదేశాంగ విధానం, రక్షణ, ఆర్థిక తదితర కీలక అంశాల పై ఆయా ప్రభుత్వాలు తగిన నిర్ణయాలు తీసుకోలేకపోయేవి. ఒకరకంగా చెప్పాలంటే సంకీర్ణ శకం మనదేశాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్లిందనే చెప్పాలి. ఇక 2014 నుంచి నరేంద్రమోదీ దేశ ప్రధాని అయ్యాక, ఆయన తన ఛరిష్మాతో మాత్రమే కాదు, పటిష్టమైన విదేశాంగ, ఆర్థిక, రక్షణ విధానాలతో దేశాన్ని అంతర్జాతీయ యువనికపై ఒక కీలకస్థానంలో నిలిపారనడంలో ఎంతమాత్రం సందేహంలేదు. విచిత్రమేమంటే గత పదేళ్లుగా అధికారంలో వున్నప్పటికీ ఆయన ఛరి ష్మా ఎక్కడా తగ్గకపోవడం గమనార్హం. అంతర్జాతీయంగా అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరుగా పేరు సంపాదించుకున్నారు. భిన్న ధృవాలైన రష్యా`అమెరికాలను సమతుల్య రీతిలో ని ర్వహించగల సామర్థ్యం ఆయన నేతృత్వంలోని టీమ్‌కే సాధ్యమైంది. నేడు సమస్యా పరిష్కారకర్త దేశంగా అంతర్జాతీయంగా భారత్ తన పేరు ప్రఖ్యాతులను సుస్థిరం చేసుకుంది. ఈ నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ స్థానాలు గెలుచుకోకపోయినా, కూటమి పరంగా మెజారిటీ సాధించి అధికారంలో వున్న ఎన్డీఏపై ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ఇంఇయాటుడే`సీఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలు ఒకింత ఆశ్చర్యం, ఆసక్తి కలిగించే రీతిలో వుండటం విశేషం.
సర్వసాధారణంగా అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ఐదేళ్ల పాలనాకాలం తర్వాత ప్రజల్లో ప్రభుత్వవ్యతిరేకత వ్యక్తం కావడం సహజం. కేంద్రంలో ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి అధికారంలో కొనసాగుతోంది. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీఏ కూటమి బలం 293. ఇందులో భారతీయ జనతాపార్టీవి 240 స్థానాలు. 2014 సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 38.5% ఓట్లతో అధికారాన్ని కైవసం చేసుకుంది. అప్పటివరకు అంటే 2004`2014 వరకు పాలించిన యు.పి.ఎ. కూటమి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. దేశ ప్రధానిగా నరేంద్రమోదీ మొట్టమొదటి సారి ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత 2019 ఎన్నికల్లో 45.43% ఓట్లతో 353 స్థానాల్లో గెలిచిన ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వచ్చింది. రెండోసారి నరేంద్రమోదీ ప్రధాని అయ్యారు. ఇక 2024 ఎన్నికల్లో 400 సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ప్రచారం సాగించినప్పటికీ కూటమి 293 స్థానాలకే పరిమితం కా వాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏడాది కాలం ఎన్డీఏ కూటమి పాలనపై ప్రజాభిప్రాయం, ఓట్ల రూపంలో మారితే ఎన్ని స్థానాలు గెలుచుకోగలదన్న అంశంపై ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో ఇండియా టుడే`సీ ఓటర్ నిర్వహించిన తాజా సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఒకరకంగా చెప్పాలంటే ఏడాది క్రితం అధికారంలోకి వచ్చినప్పటికీ అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే సంతృప్తికరమైన పనితీరు ప్రదర్శించని ఎన్డీఏ ఇప్పటికిప్పు డు ఎన్నికలు జరిగితే 353 స్థానాల్లో తిరుగులేని విజయం సాధిస్తుందని ఈ సర్వే తేల్చింది. ఇందులో బీజేపీ సొంతంగా 280కి పైగా స్థానాలను కైవసం చేసుకొని సాధారణ మెజారిటీ సాధి స్తుందని కూడా పేర్కొంది. ఇక లోక్‌సభలో 243గా ఉన్న ఇండీ కూటమి బలం ఏకంగా 188కి పడిపోతుందని కూడా స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరి 2 నుంచి ఫిబ్రవరి 9వరకు దేశం లోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ సర్వేను నిర్వహించారు.
ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో 39 రాజకీయ పార్టీలు భాగస్వాములుగా వుండగా వీటిల్లో బీజేపీ, నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీలు మాత్రమే జాతీయ పార్టీలుగా ఎన్నికల కమిషన్ చేత గుర్తింపు పొందా యి. మిగిలినవన్నీ ప్రాంతీయపార్టీలే. ఎన్నికలు జరిగితే భారతీయ జనతాపార్టీ 281 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. అంటే ప్రస్తుతం వున్న 240 స్థానాలతో పోలిస్తే మరో 41స్థానాలను కైవసం చేసుకోగలుగుతుంది. ఏడాది కాలంలో బీజేపీ తిరిగి పుంజుకుందన్నది స్పష్టమవుతోంది. ఇక కాంగ్రెస్ ప్రస్తుత బలం 99 నుంచి 78కి పడిపోతుంది. వ్యక్తిగతంగా భాజపా ఓట్ల శాతం గతంతో పోలిస్తే మూడు శాతం పెరిగి 41%కు పెరుగుతుంది. ఇక కాంగ్రెస్ ఓట్ల షేరు 20శాతానికి పడిపోవడం గమనార్హం.
మొత్తంమీద పరిశీలిస్తే పదేళ్లకాలం పరిపాలించినా నరేంద్రమోదీ ఛరిష్మా చెక్కుచెదరలేదన్నదని ఈ సర్వే స్పష్టం చేసింది. ఇక కాంగ్రెస్ తన తిరోగమన విధానాలను ఇప్పటికైనా సరిదిద్దుకోపోతే పతన తప్ప ఉత్థానం వుండదని సర్వే ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తాను ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలను పున్ణసమీక్షించుకోవాలి. మితిమీరిన మైనారిటీ బుజ్జగిం పు, మెజారిటీ వర్గాలను నిర్లక్ష్యం చేయడం, అధికారంకోసం అలవికాని హామీలివ్వడం, ప్రతి అంశాన్ని ప్రతికూల ధోరణితో ఆలోచించడం వంటి పద్ధతులను మార్చుకోకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ మనుగడ కష్టం. ఇప్పటికే కీలక నాయకులను కోల్పోయి, కేవలం గాంధీ కుటుంబంపై ఆధారపడి రాజకీయాల్లో కొనసాగే స్వయం ప్రకాశం లేని నాయకులే పార్టీలో అధికం. ఇదే పార్టీని దారుణంగా దెబ్బతీస్తోంది. గత ఎన్నికల్లో నరేంద్రమోదీ ‘400 సీట్లు’ నినాదాన్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలచుకుంది. ముఖ్యంగా అన్ని సీట్లు ఎన్డీఏకి వస్తే, రాజ్యాంగాన్ని మార్చేస్తా రని, రిజర్వేషన్లు ఎత్తేస్తారని తప్పుడు ప్రచారాలను విపరీతంగా చేపట్టడం ప్రజల్లో ముఖ్యంగా వెనుకబడిన వర్గాల్లో అనుమానాలు పెరిగి, భాజపాను 240 వద్దే నిలిపేశారు. విచిత్రంగా ఆరునెలలు తిరగకుండానే మహారాష్ట్ర, హర్యానా, ఢల్లీి ఎన్నికల్లో విజయం సాధించి పడిలేచిన బంతిలాభాజపా తన సత్తా ఏంటో చూపింది.
తమిళనాడులో మళ్లీ డీఎంకోకాంగ్రెస్ కూటమి 39 స్థానాలను స్వీప్ చేస్తుందని సర్వే స్పష్టం చేసింది. కాకపోతే బీజేపీ ఓట్ల శాతం పెరిగినా, అవి సీట్లను గెలిపించే స్థాయిలో వుండవని పే ర్కొంది. రాష్ట్రంలో గతంతో పోలిస్తే డీఎంకే కూటమి 52% ఓట్ల షేరు సాధిస్తుందని పేర్కొంది. ఇది గత ఎన్నికలతో పోలిస్తే ఇది ఐదుశాతం ఎక్కువ. గత ఎన్నికల్లో తమిళనాడులో 18% ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి 21% వరకు పొందగలుతుగుందని సర్వే పేర్కొంది. ఇక ఏ.ఐ.డి.ఎం.కె గతంలో 20% ఓట్లు పొందగా 3శాతం పెరిగి 23%కు చేరుతుంది.
ఇక ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో భాజపా 43`45 స్థానాల్లో గెలిచే అవకాశ మున్నదని సర్వే పేర్కొంది. బీజేపీ ఓట్ల శాతం గతంతో పోలిస్తే 4% పెరగుతుందని, ఇండీ బ్లాక్‌ఓట్లు 2% తగ్గుతాయని సర్వే తెలిపింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండీ కూటమికి 43 సీట్లు వచ్చాయి. వీటిల్లో 37 సమాజ్‌వాదీ పార్టీవి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇండీ కూటమి సీట్లు 34`36 వరకు మాత్రమే పరిమితమవుతాయి. భాజపా కేవలం 33 సీట్లలోనే విజయం సాధించింది. అయితే ఎన్డీఏ కూటమికి ఇప్పుడు రాష్ట్రం నుంచి 36 స్థానాలున్నాయి. ఇక బిహార్‌లోని 40 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమి 33`35 స్థానాల్లో విజయం సాధిస్తే, ‘మహాఘట్‌బంధన్’ కూటమికి 5`7 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. 2024 ఎన్నికల్లో ఎన్డీఏకు 47% ఓట్లు రాగా ఇప్పుడు అవి 52%కు పెరగనున్నాయి. బిహార్ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్డీఏ కూటమిలో చీలిక లేకుండా, ఉమ్మడిగా పోటీచేస్తే ప్రభుత్వానికి ఢోకాలేదని ఈ సర్వే తెలియజేస్తోంది. ఎందుకంటే ఢల్లీిలో మాదిరిగా బిహార్‌లో ఓట్ల చీలిక సాధ్యం కాదు. బీజేపీ, జేడీయూ, లోక్‌జనశక్తి పార్టీల కూటమి బలంగా వుంటే వీరిని ఓడిరచడం సాధ్యంకాదు. విచిత్రమేమంటే గత ఏడెనిమిది సంవత్సరాలుగా నితిష్‌కుమార్ హవా రాష్ట్రంలో అప్రతిహతంగా సాగుతూ వచ్చింది. ఈసారి ఆయన గతంలో మాదిరిగా ఓటర్లను ఆకట్లుకోలేక పోవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు భిన్నంగా బీజేపీ ఓట్లశాతాన్ని గణనీయంగా పెంచుకొని మరింత బలంగా రూపొంది అధికారంపై పట్టు సాధించవచ్చుననేది స్థానిక విశ్లేషకుల అంచనా. ఒరిస్సా విషయానికి వస్తే ఈ సర్వేలో 52% మంది ఓటర్లు నవీన్ పట్నా యక్‌ను తిరుగులేని నే తగా పేర్కొన్నారు.
మొత్తంమీద జాతీయ స్థాయిలో సర్వే ఫలితాలను పరిశీలిస్తే ఎన్డీఏ కూటమి మరింత బలపడే అవకాశాలే మెండుగా వున్నట్టు తోస్తున్నది. ప్రజలు ఊరికే పట్టం కట్టరు…పనితీరుకే ప్రాధాన్యమి స్తారన్న సంగతిని ఈ సర్వే స్పష్టం చేస్తోంది.