@ నెక్కొండ ఇంటింటి ప్రచారంలో సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి
@మహబూబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ తెలుపు కాయం: రంజిత్ రెడ్డి
#నెక్కొండ, నేటి ధాత్రి: కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసిన గుర్తుగా సోనియాగాంధీకి 17 ఎంపీ సీట్లు తెలంగాణలో గెలిచి తెలంగాణ కానుకను అందచేయాలని గత కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో మహబూబాబాద్ నుండి ఎంపిగా గెలిచిన బలరాం నాయక్ నెక్కొండ మండల కేంద్రానికి పద్మావతి ఎక్స్ప్రెస్ లాంటి రైళ్లను నిలుపుదల తోపాటు ఎంపీ విధుల కింద నెక్కొండను బంగారు కొండగా తీర్చిదిద్దారని ఆపద వస్తే అన్నా అంటే బలరాం నాయక్ అన్న నెక్కొండ ప్రజలతో నిత్యం మమేకంగా ఉంటారని ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలరాం నాయక్ బలపరచడం జరిగిందని రాహుల్ గాంధీని ప్రధాని చేయాలంటే మహబూబాబాద్ ఎంపి గా బలరాం నాయక్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని నెక్కొండ మండల కేంద్రంలో జరిగిన ఇంటింటి ప్రచారంలో నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి అన్నారు. అంతకు ముందుగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి మరియు గ్రామ దేవత బొడ్రాయి వద్ద నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి ప్రత్యేక పూజలు కొనసాగించి ఇంటింటి ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రావుల హరీష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండి శివకుమార్, రామాలయం కమిటీ చైర్మన్ కుమార్ రెడ్డి సుధాకర్ రెడ్డి, ఆంజనేయస్వామి దేవాలయ చైర్మన్ బెజ్జంకి వెంకటేశ్వర్లు, నెక్కొండ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సింగం ప్రశాంత్, మండల కాంగ్రెస్ నాయకులు కుసుమ చెన్నకేశవులు, గొల్లి సుబ్బారెడ్డి, ఈదునూరి సాయి కృష్ణ, చల్ల పాపిరెడ్డి, ఎండి అన్వర్, రావుల మైపాల్ రెడ్డి, ఎండి అమిద్, వనం ఏకాంతం, మహమ్మద్ అమిర్, షేక్ రఫీ, వడ్డే రాజశేఖర్, పొట్లపల్లి వీరస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.