అవినీతి అనకొండ సునీల్ రావును ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయం- వెలిచాల
వెలిచాల సమక్షంలో నూటయాభై మందితో కాంగ్రెస్ పార్టీలో చేరిన డాక్టర్ రాజన్న గౌడ్
కరీంనగర్, నేటిధాత్రి:
ప్రపంచంలోనే ఎక్కడా లేని భయంకరమైన అవినీతి అనకొండ సునీల్ రావును ఆ డివిజన్ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు. మేయర్ గా ఉన్న సమయంలో వందలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి ప్రజలను పీడించి దౌర్జన్యాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఇల్లు కట్టాలన్న అపార్ట్మెంట్ నిర్మించాలన్న షాపు పెట్టుకోవాలన్నా సునీల్ రావు డబ్బులు దండుకునేవారని ప్రజలే బహిరంగంగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. అలాంటి ఆవినీతి ఆనకుండా సునీల్ రావును డివిజన్ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించబోతున్నారని పేర్కొన్నారు. గురువారం కొత్తపెళ్లిలోని వెలిచాల ప్రజా కార్యాలయంలో 42వ డివిజన్ కు చెందిన పశుసంవర్ధక శాఖ రిటైర్డ్ జిల్లా అధికారి డాక్టర్ పంజాల రాజన్న గౌడ్ నూటయాభై మంది డివిజన్ ప్రజలు, మహిళలు యువకులతో కలిసి వెలిచాల రాజేందర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. డాక్టర్ రాజన్న గౌడ్ కు రాజేందర్రావు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేందర్రావు మాట్లాడుతూ 42వ డివిజన్ కు చెందిన రాజన్న గౌడ్ నీతికి నిజాయితీకి మారుపేరని విద్యార్థి నేతగా ఉన్న సమయంలో అలుపెరగని ప్రజా పోరాటం చేశారని పేర్కొన్నారు. ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారని తెలిపారు. పశుసంవర్ధక శాఖలో ఉన్నతాధికారీగా పనిచేసి ప్రజల మన్ననలు పొందారని గుర్తు చేశారు. దాదాపు నలబై సంవత్సరాలు పాటు అధికారిగా అత్యుత్తమ సేవలందించారని రాజేందర్రావు పేర్కొన్నారు. అలాంటి రాజన్న గౌడ్ తన ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు ఏసాయం కావాలన్నా అర్ధరాత్రి అర్ధరాత్రి వెన్నంటే ఉండే సాయం అందించే మనస్తత్వం కలిగిన వ్యక్తి డాక్టర్ రాజన్న గౌడ్ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో రాజన్న గౌడ్ కు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో రాజన్న గౌడ్ కు అత్యంత గౌరవం ఇస్తామని పేర్కొన్నారు. భయంకరమైన అవినీతి అనకొండ మాజీ మేయర్ పై నీతిగా నిజాయితీగా వ్యవహరించే రాజన్న గౌడ్ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు. మాజీ మేయర్ సునీల్ రావు వందలాదికోట్లు ప్రజలను పీడించి అక్రమంగా సంపాదించారని చరిత్రలో భయంకరమైన అవినీతి ఆనకొండ ఎక్కడా లేరని రాజేందర్రావు మండిపడ్డారు. సునీల్ రావు అవినీతినీ చరిత్రలో చెరిపి వేయలేమని అంతా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పట్టణ ప్రజల అసహ్యించుకుంటున్నారని చిత్కరిస్తున్నారని అలాంటి వ్యక్తికి తగిన గుణపాఠం ప్రజలు చెప్పబోతున్నారని రాజేందర్రావు పేర్కొన్నారు. అలాంటి సునీల్ రావును డివిజన్ ప్రజలు ఘోరంగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. 42వ డివిజన్ లో అవినీతికి నీతికి మధ్య పోటీ జరుగుతున్నదని నీతిగా నిజాయితీగా వ్యవహరించే రాజన్న గౌడ్ ను ప్రజలు గెలిపించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నగరపాలక సంస్థ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా సమష్టిగా కృషి చేస్తున్నామని రాజేందర్రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన డాక్టర్ రాజన్న గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే ఎనలేని గౌరవం ఇష్టమని పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా పశు సమర్ధక శాఖలో అధికారిగా పని చేశానని ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు. డివిజన్ ప్రజలను పట్టిపీడించిన వ్యక్తి సునీల్ రావ్ అని ఆయనను ఓడించేందుకు డివిజన్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. సునీల్ రావు అవినీతిని అడ్డుకునేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారని పేర్కొన్నారు. వెలిచాల రాజేందర్రావు మార్గదర్శకంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని రాజన్న గౌడ్ తెలిపారు. 42వ డివిజన్ ప్రజల ఆశీర్వాదం అండదండలతో కార్పొరేటర్ గా మంచి మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పంజాల రాజన్న గౌడ్ తో పాటు మహిళలు యువకులు డివిజన్ ప్రజలు దాదాపు నూటయాభై మందికి రాజేందర్ రావ్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఆకుల నరసన్న, ఆర్ష మల్లేశం మల్లికార్జున రాజేందర్ గుడూరి మురళి కోటగిరి భూమా గౌడ్ వేల్పుల వెంకటేష్, పడాల అజయ్ గౌడ్ కొత్తూరు జగన్ గౌడ్ నేరేళ్ల నాగన్న గౌడ్, పలువురు కాంగ్రెస్ నాయకులు డివిజన్ ప్రజలు యువకులు మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
