తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్*!!!
జగిత్యాల నేటి ధాత్రి
ధర్మపురి నియోజకవర్గ శాసన సభ్యులు గా గెలిచిన అనంతరం మొదటి సారిగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామీ ని బుధవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామీ వారిని శాసన సభ్యులుగా,ప్రభుత్వ విప్ గా ఎన్నికైన తర్వాత మొదటి సారి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని,భగవంతుని ఆశీర్వాదం వల్ల ఇటీవల తనకు జరిగిన రోడ్డు ప్రమాదం నుండి బయట పడటం జరిగిందని,ఆ ఏడుకొండల స్వామి వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ధర్మపురి నియోజక వర్గ ప్రజలకు ఏళ్ల వేళల ఉండాలని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా స్వామి వారిని కోరుకున్నట్లు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ పేద ప్రజలకు ఇచ్చిన ఎటువంటి హామీని నిలబెట్టుకోలేదని,రానున్న ఎంపి ఎన్నికల్లో కూడా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండి పార్టీని అధికారంలోకి తీసుకువస్తారని ఈ సందర్భంగా తెలిపారు