– కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులి సత్యం.
చందుర్తి, నేటిధాత్రి:
ఈ నెలలో జరిగే మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వేములవాడ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగే ఉత్సవాలకు ఉత్సవ కమిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో 29మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేయడము హర్షనీయమని ఆ కమిటీలో చందుర్తి మండల కేంద్రానికి చెందిన గొట్టే ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మండలఅధ్యక్షులు చింతపంటీ రామస్వామిని నియమించడం చాలా సంతోషంగా ఉందని చందుర్తి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులి సత్యం శుక్రవారం రోజున పాత్రికేయుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వము పనిచేసే వారికే పదవులు ఇస్తుందని వారం రోజులపాటు జరిగే ఉత్సవాలు కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చూసుకోవడానికి పోలీస్ సిబ్బందిని ఇతర సిబ్బందిని వారితో పాటు ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూసుకోవడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారని అన్నారు. కమిటీలో ఇద్దరికీ అవకాశం కల్పించినందుకు మండల ప్రజల తరఫున సీఎం రేవంత్ రెడ్డికి అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.