బ్యాంకులో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తులు అరెస్ట్

పరకాల నేటిధాత్రి


పరకాల బస్టాండ్ కూడలిలో వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా అరికెల కార్తీక్ తండ్రి సాలయ్య(29),పెరిక చరణ్ తండ్రి శంకర్ అనే ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించగా వారిని పోలీస్ లు పట్టుకుని విచారించారు.కార్తీక్ ప్రయివేట్ ఉద్యోగం చేస్తూ వికాస్ నగర్ లో ఉంటున్నానని,చరణ్ సిఎస్ఐ కాలనీ కి చెందినవారని తేలింది.వీరిద్దరికి గతంలోనే పరిచయం ఏర్పడిందని మునుపు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ డబ్బులు సులువుగా ఎలా సంపాదించాలనే దురుద్దేశంతో ఎవరినైనా మోసం చేద్దామని కార్తీక్,పెరుకచరన్ తో ఎవరైనా ఉంటే తీసుకురమ్మని డీసీసీబీ బ్యాంకులో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు,అటెండర్ పోస్టులు ఉన్నాయని చెప్పి తన బంధువైన మారేపల్లి మనోజ్ వద్ద నుండి 1,85,000 రూపాయలు,బీరెల్లి శ్రీకాంత్ వద్ద నుండి 2,40,000,బొచ్చు శ్రీకాంత్ వద్ద 80,000రూపాయలు,బొచ్చు అఖిల్ వద్ద 316000 మొత్తం 81,6000 రూపాయలను తీసుకొని కార్తీక్,పెరక చరణ్ తో కలిసి ఒక తప్పుడు మెయిల్ ను క్రియేట్ చేసి మెయిల్ ద్వారా డబ్బులు డిసిసిబి బ్యాంక్ ల లోగోలను తయారుచేసి తాము క్రియేట్ చేసిన మెయిల్ ద్వారా డబ్బులు చెల్లించిన వారికి ఆర్డర్ కాపీస్ అని సెలెక్టెడ్ కాపీస్ అని అపార్ట్మెంట్ లెటర్స్ అని ట్రాన్స్ఫర్స్ లెటర్స్ అని ల్యాప్టాప్ల ద్వారా తప్పుడు మెయిల్ పంపించారు.తర్వాత కొన్ని రోజులకు మీ ఒరిజినల్ సర్టిఫికెట్ తీసుకురండి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయాలని చెప్పి వారి వద్ద నుండి ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకోవడం జరిగింది.ఇదంతా బూటకం అని తెలుసుకున్న భాదితులు పరకాల పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా అది తెలుసుకున్న కార్తీక్, చరణ్ లు పరకాల బస్టాండ్ లో దిగి వస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.వారితో పాటు రెండు లాప్టాప్ లు,రెండు సెల్ ఫోన్ లు,ఒరిజినల్ మెమోస్,నకిలీ ఆర్డర్ కాపీలు, ఆపాయింట్మెంట్ లెటర్స్,48,0000 నగదు స్వాధీనం చేసుకున్నారు.సిఐ రవిరాజును,ఎస్ఐ రమేష్ ను కానిస్టేబుల్ డి.నాగరాజు, భాస్కర్,డి.దేవేందర్,ఎస్.బాబు,హోంగార్డ్ రవీందర్,దీనికి సహకరించిన టాస్క్ఫోర్స్ సిబ్బందిని పరకాల ఏసీపీ కిశోర్ కుమార్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!