కేంద్రం వైఫల్యాలు…కాంగ్రెస్‌కు జవసత్వాలు!

https://epaper.netidhatri.com/view/333/netidhathri-e-paper-30th-july-2024%09

`కేంద్రం మోపుతున్న పన్నులు…కాంగ్రెస్‌ పెరుగుతున్న ఆదరణలు.

`పుంజుకుంటున్న కాంగ్రెస్‌!

`దేశ వ్యాప్తంగా వీస్తున్న కాంగ్రెస్‌ గాలి.

`ఉత్తరాధిలో మరింత ఉదృతంగా..

`బీజేపిపై పెరుగుతున్న వ్యతిరేకత.

`బీజేపి చెప్పేదొకటి చేస్తున్నదొకటి.

`బీజేపిపై ప్రజల్లో ప్రశ్న మొదలైంది.

`కేంద్ర బడ్జెట్‌ పై దేశ వ్యాప్తంగా విరుపులు.

`ఎకనామిస్టులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

`పన్నులు వసూలు చేయడమే కేంద్రం పనిగా పెట్టుకుందని విమర్శలు.

`ప్రజల మోయలేని భారాన్ని మోపుతున్నారు.

`మధ్యతరగతి జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు.

`దేశ వ్యాప్తంగా ఇదే భావన.

`బీజేపి మోడీ సర్కార్‌ కోరికోరి తెచ్చుకుంటున్న వ్యతిరేకత.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అధికారంలోకి వచ్చే దాకా ఒక్క ఛాన్సు అంటూ ప్రజలకు విన్నవించుకుంటారు. ప్రజాపోరాటాలు చేస్తారు. ప్రజల పక్షాన వుండి ఉద్యమాలు చేస్తారు. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తారు. ఎన్నికల నాటికి ఆ పార్టీకి అనుకూలమైన వాతావరణం సృష్టించుకోవడానికి నానా తిప్పలు పడుతుంటారు. క్షేత్ర స్ధాయి నుంచి జాతీయ స్ధాయి దాక నాయకులు పడరాని కష్టాలు పడుతుంటారు. కేసులు ఎదుర్కొంటారు. రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలా బిజేపి రెండు స్ధానాల నుంచి కేంద్రంలో అధికారం సంపాదించుకోవడానికి సుమారు నలభై సంవత్సరాల పాటు పడరాని పాట్లు పడిరది. మరి ప్రజలు బిజేపిని ఆదరించి, అక్కున చేర్చుకొని వరుసగా అవకాశాలిస్తూ అధికారాన్ని అప్పగిస్తే ఏం చేస్తున్నారన్న చర్చ దేశ వ్యాప్తంగా మొదలైంది. నిజంగా బిజేపి నేతలు చెప్పినవి నిజాలేనా? ఆ నిజాలను ఆచరిస్తున్నారా? ఆ నిజాలనే ఇప్పుడు అనుసరిస్తున్నారా? అన్న దానిపై ప్రజల్లో ఆలోచన కూడా మొదలైందనే చెప్పాలి. ఈ పార్లమెంటు ఎన్నికల్లో బిజేపి వికసిత భారత్‌ అంటూ పెద్దఎత్తున ప్రచారం చేసింది. కాని ఏమైంది? ప్రజల నుంచి ఎంతో కొంత ఎందుకు తిరస్కారం అందుకున్నది? ఈ ఎన్నికల్లో 400 సీట్లు అన్న నినాదం ఎక్కడ దెబ్బతిన్నది? అన్నదానిపై బిజేపి ఇప్పటికైనా లోతైన విశ్లేషణ జరగాల్సిన అవసరం వుంది. లేకుంటే బిజేపి ఓడ మునగడం ఖామయని బిజేపి పెద్దలే హెచ్చరిస్తున్నారు. ఎంత పెద్ద ఓడైనా చిన్న రంద్రం పడితేచాలు మునిగిపోవడానికి ఎంతో కాలం పట్టదు. ఎదగడానికి పట్టినంత కాలంలో బిజేపి మునగడానికి అందులో సగం సమయం కూడ వుండదంటున్నారు. ఇప్పటికైనా తేరుకోవడానికి అవకాశం వున్నా బిజేపి ఆ వైపు అడుగులు పడకపోవడం స్వయంకృతాపధమే అవుతుంది. ఒకానొక సమయంలో బిజేపిలో చెప్పుకోవడానికి పది మంది నేతలు వుండేవారు. వారి పేర్లు ప్రముఖంగా వినిపించేవి. బిజేపి ఎదిగే సమయంలో కూడా బలమైన నేతలు అన్న ముద్ర వున్న నాయకులు కూడా ఇప్పుడు చేష్టలుడిగి చూస్తున్నారు. పార్టీ అధికారంలో వుంది. పదవులు వస్తున్నాయి? చాలు అనుకుంటున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ముఖ్యంగా బిజేపి గత పదిహేనేళ్లుగా నమ్ముకున్న ఏకైక నాయత్వం ప్రధాని నరేంద్ర మోడీ. ఏకైక రోల్‌ మోడల్‌ గుజరాత్‌. ఇదే బిజేపికి ఊపిరి పోసింది. ఆయుష్షు పెంచింది. ఇందులో ఎవరికీ అనుమానం లేదు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా సూపర్‌ సక్సెస్‌ను చూసిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు ఎందుకు వివాదాలలో చిక్కుకుంటున్నారన్నదానిపై కూడా పార్టీలో చర్చ జరగాల్సిన అవసరం వుంది.

2001 జనవరి 26 నాడు దేశమంతా ఘనతంత్ర దినోత్సవాలలో వుంటే, గుజరాత్‌లో ఒక్కసారిగా పెద్ద భూకంపం సంభవించింది. దాంతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిరది. మన దేశంలో భూకంపాలకు ఎక్కువగా ఆస్కారమున్న ప్రాంతాలలో గుజరాత్‌ ఒకటి. అయితే అంతటి భూకంపం దేశంలో ఎన్నడూ సంభవించలేదు. గుజరాత్‌ ఒక్కసారిగా అతలాకుతలమైంది. గుజరాత్‌ను నిలబెట్టడం ఎలా అనుకుంటున్న తరుణంలోనే బిజేపి అప్పటి ముఖ్యమంత్రి కుషుభాయ్‌ పటేల్‌ను దించి, నరేంద్ర మోడీని ముఖ్యమంత్రిని చేసింది. అలాంటి సమయంలో ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోడీ గుజరాత్‌ను మళ్లీ నిలబెట్టడానికి ఎంతో శ్రద్ద పెట్టారు. ఆ సమయంలో కేంద్రంలో కూడా ఎన్డీయే ప్రభుత్వం వుండడం విశేషం. గుజరాత్‌ను నిలబెట్టిన ఘనత ఖచ్చితంగా అప్పటి ముఖ్యమంత్రి, నేటి ప్రదాని నరేంద్ర మోడీకే దక్కింది. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. శషబిషలకు తావులేదు. భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన గుజరాత్‌ను మళ్లీ తక్కువ సమయంలో నిలబెట్టడానికి నరేంద్ర మోడీ పడిన శ్రమ అంతా ఇంతా కాదు. అయితే ఇక్కడ కాంగ్రెస్‌ నాయకులు చెప్పే మాట కూడా ఆలోచించాల్సిన అంశమే. 2004లో యూపిఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినా గుజరాత్‌కు పూర్తి సహయ సహాకారాలు అందించిందనేది కూడా వాస్తవం. ఒక రకంగా కాంగ్రెస్‌ వల్లనే వల్లనే గుజరాత్‌ కోలుకోగలిగందనేది ఆ పార్టీ వాదన. ఇందులో పూర్తి సత్యం వుంది. ఆనాడు రాజకీయాలకు అతీతంగా కేంద్రం ప్రభుత్వం పూర్తిగా సహకరించడం వల్లనే గుజరాత్‌ కోలుకున్నదనేది కూడా అందరూ అంగీకరించాల్సిన విషయం. అయితే ఆ సమయంలో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి కావడం, రాష్ట్రం మీద ప్రత్యేక శ్రద్ద పెట్టడమే కాకుండా, తక్కువ సమయంలో దేశానికి గుజరాత్‌ను నిలబెట్టడమే కాకుండా రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దారు. దాంతో దేశ రాజకీయమంతా ఒక్కసారిగా గుజరాత్‌ వైపు చూసింది. నరేంద్ర మోడీ నాయత్వం కోసం దేశం కూడా తపించింది. ఆయనకంటే ఎంతో మంది సీనియర్లు వున్నా బిజేపి కూడా నరేంద్ర మోడీనే కోరుకున్నది. బిజేపిలో ఎల్‌కే అద్వానీ, ప్రకాశ్‌ జవదేకర్‌ లాంటి ఉద్దంఢ నాయకులు కూడా నరేంద్రమోడీకి సపోర్టు చేశారు. 2014 ఎన్నికల్లో బిజేపి అధికారంలోకి రావడానికి అందరూ కృషిచేశారు. గుజరాత్‌ను తక్కువ సమయంలో నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా మార్చిన నరేంద్ర మోడీ దేశాన్ని కూడా అదే తరహాలో నెంబర్‌ వన్‌ చేస్తారని ప్రజలు బలంగా నమ్మారు. పైగా హిందూ సమాజం మొత్తం నరేంద్ర మోడీని ఒక ఐకాన్‌గా గుర్తించారు. 2004 నుంచి 2014 దాకా కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలో పాలన సాగించిన యూపిఏ ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నది. టూజీ స్ప్రెక్టమ్‌ లాంటి అనేక వివాదాలు చుట్టుముట్టాయి. అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మీదే ఏకంగా బొగ్గు కుంభకోణం ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో బొగ్గు గునుల సహాయ మంత్రిగా వున్న సనీ దర్శకుడు దాసరి నారాయణ రావుపై కూడా విమర్శలు చుట్టుముట్టాయి. కాంగ్రెస్‌ అంటేనే స్కాంగ్రెస్‌ అన్నంతగా ప్రచారం సాగించారు.

బిజేపి చరిత్రలోనే లేనంత మెజార్టీని కట్టబెట్టి దేశ ప్రజలు గెలిపించారు. 272 సీట్లతో బిజేపి గెలిచింది. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు. రెండోసారి 353 సీట్లతో బిజేపి విజయదుందిబి మోగించింది. అయితే 2024 వరకు వచ్చేసరికి బిజేపి గ్రాప్‌ పడిపోయింది. రెండు దఫాలుగా లోక్‌సభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని కాంగ్రెస్‌ ఈసారి ప్రతిపక్ష హోదా పొందగలిగింది. అంటే బిజేపి పతనం ఇక్కడే మొదలైందని చెప్పకతప్పదు. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల కాంగ్రెస్‌ మీద ప్రతిపక్ష హోదా రాహుల్‌ పొందడం మీద పదో తరగతి పిల్లవాడి మార్కులతో పోల్చి పిట్ట కధలు చెప్పినంత మాత్రాన సరిపోదు. బిజేపి గ్రాప్‌ పడిపోతోందని గమనించాల్సిన అవసరం వుంది. త్వరలో శాసన సభ ఎన్నికల జరగబోయే రాష్ట్రాలలో ఈ ప్రభావం పడుతుందని గుర్తించకపోతే నష్టం తప్పదు. పడిపోతున్న గ్రాఫ్‌ను పెంచుకోవాల్సిన తరుణంలో మధ్య తరగతి ప్రజల మేలు కోరే బడ్జెన్‌ను కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తుందని అందరూ ఊహించారు. కాని మళ్లీ పేద వర్గాలకు ఆశనిపాతంగా మారే బడ్జెట్‌నే ప్రవేశపెట్టడంతో దేశ ప్రజల చూపు ఒక్కసారిగా కాంగ్రెస్‌ వైపు మళ్లుతోందిన చెప్పడంలో సందేహం లేదు. దేశ ప్రజలు పదేళ్లపాటు బిజేపిని ఎంతో సహనంతో భరించారనే చెప్పాలి. ఇంకా భరిస్తాం..కాని మారితే బాగుంటుందని సూచననిస్తూ, బలమైన ప్రతిపక్షాన్ని ఇచ్చారు. కాని బిజేపిలో మార్పు రావడంలేదు. ముఖ్యంగా ప్రదాని నరేంద్ర మోడీని బిజేపి ప్రశ్నించే స్దితిలో లేదు. అసలు పార్టీ మొత్తం ప్రదాని గుప్పిట్లోకి వెళ్లిపోయిందనే వాదనలు బలంగానే వున్నాయి. అందుకే పార్టీ ప్రతిష్ట మసకబారుతున్నా మాట్లాడలేకపోతున్నారు. తప్పుల వైపు అడుగులు పడుతున్నాయని హెచ్చరించలేకపోతున్నారు. పెరుగుతున్న ధరలు, పెంచుకుంటూ పోతున్న పన్నులు బిజేపికి పతనానికి దారులు. గత ఎన్నికల్లో బిజేపి తన సిద్దాంతాలకు వ్యతిరేకంగా వెళ్లిందనే చెప్పాలి. కాంగ్రెస్‌ మీద చేసిన ఆరోపణలు దేశ ప్రజల్లో బిజేపికి అనుకూలంగా మారకపోగా, వ్యతిరేకంగా మారాయి. నిజంగా దేశ ప్రజలపై, మధ్య తరగతి జనం మీద ప్రేమ వుంటే ఈ పన్నులేమిటి? మంచినీటి నుంచి మొదలు మందుల దాకా ఈ వాతలేమిటి? అన్న ప్రశ్నలు మొదలౌతున్నాయి. ఇటీవల పార్లమెంటులో బడ్జెట్‌కు ముందు ప్రవేశ పెట్టిన ఆర్ధిక సర్వేలో చైనాతో వ్యాపార సంబంధాలపై కేంద్ర ప్రభుత్వం నిజ స్వరూపం వెల్లడైంది. ఇంత కాలం ఏ చైనాను బూచిగా చూపి, దేశ ప్రతిష్ట, ఆత్మగౌరవం, దేశ భక్తి గురించి చెప్పారో..అదే చైనాతో వాణిజ్య ఒప్పందాలలో జరుగుతున్న స్నేహం కూడా వెల్లడి కావడం జరిగింది. దేశంలో మీడియా అంతా వాటిపై గొల్లుమన్నది. బిజేపి స్వదేశీ విధానం అన్నది ఓట్లకోసం తప్ప దేశం కోసం కాదని తేలిపోయింది. ఇప్పుడు ఆ నివేదిక బిజేపికి ఆశనిపాతం కానున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!