
దోమల నివారణకు ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలి
ఇంటి చుట్టుపక్కల నీరు నిలువ చేయరాదు
జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 29వ వార్డు సుభాష్ కాలనీలో మెప్మా రిసోర్స్ పర్సన్ ఆధ్వర్యంలో శుక్రవారం డ్రై డే ఫ్రైడే లో కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (ఎల్బీ) సంఘ కార్యాలయం, స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరైనారు
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంటి చుట్టు ప్రక్కల ఎటువంటి నీటి నిలువలు లేకుండా చూసుకోవాలని దోమల నివారణకు తగిన జాగ్రత్తలు పాటించాలని కాలనీవాసులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి. శ్రీనివాస్ మెప్మా డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ బి రాజేశ్వరి కమ్యూనిటీ ఆర్గనైజర్ నిర్మల మెప్మా రిసోర్స్ పర్సన్స్ అందరూ పాల్గొనడం జరిగింది.