
Collector Rahul Sharma.
ప్రజలకు వైద్య సేవలపై నమ్మకం కలిగించాలి.
24 గంటలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.
చిట్యాల, నేటి దాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సిబ్బంది హాజరు రిజిస్టర్, ఓపీ, ఇన్పేషెంట్ రిజిస్టర్, ల్యాబ్లో రక్త పరీక్షల పరికరాలు, శస్త్రచికిత్స గదులను ఆయన పరిశీలించి వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజలకు వైద్యసేవలపై నమ్మకం కలిగించాలని వివరించారు.
ఆసుపత్రి చాలా బావుందని, రోజుకు ఎంత మంది ప్రజలు వైద్య సేవలకు వస్తున్నారని, రోజుకు ఎంతమంది వైద్యసేవలకు వస్తున్నారని అడుగగా 150 నుండి 200 మంది వరకు వస్తున్నారని ఓపి.సేవలు పెంచాలని వైద్యులను ఆదేశించారు. వైద్య సేవలకు ఎలాంటి వ్యాధితో బాధపడే వారు వస్తున్నారని వైద్యాదికారులను అడిగి తెలుసుకుని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై ప్రజలకు నమ్మకం కలిగించాలని సూచించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని అన్ని సమయాలలో వైద్య సేవలు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ఆసుపత్రిలో పరి శుభ్రత, సదుపాయాలు, వైద్య సేవలు మెరుగుగా ఉన్నాయని, ఎందుకు వైద్య సేవలకు ప్రజలు రావడం లేదని అన్నారు. అయితే ఇంకా మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించాలని సూచించారు. 24 గంటల పాటు సేవలు అందుబాటులో ఉండాలని, తప్పనిసరి వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యసేవలు అందించాలని తెలిపారు. అలాగే పాము, కుక్క కాటు వంటి ప్రమాదాల నివారణకు అవసరమైన మందులు, వ్యాక్సిన్ అన్నివేళల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రసూతి, చిన్న పిల్లల వైద్యులు నియామకం కొరకు చర్యలు తీసుకుంటామని, మీ మిత్రులు కానీ మీకు తెలిసిన వైద్యులు ఉంటే నియామకానికి చర్యలు తీసుకుంటామని వైద్యులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వాలియా నాయక్, డా శ్రీకాంత్, తహసీల్దార్ ఇమామ్ బాషా తదితరులు. పాల్గొన్నారు.