బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సూరయ్య
#నెక్కొండ ,నేటి ధాత్రి: నర్సంపేటలోని పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన లో భాగంగా ఈనెల 28వ తేదీన రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన సందర్భంగా నెక్కొండ బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సంగని సూరయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సంగని సూరయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో నిత్యం నియోజకవర్గ అభివృద్ధి పథంలో నడిపించేందుకు అహర్నిశలు శ్రమిస్తూ మునుపెన్నడూ లేని విధంగా నర్సంపేట ను మెడికల్ హబ్బుగా తీర్చిదిద్దుతూ నర్సంపేటకు మెడికల్ కాలేజీని తీసుకువచ్చి ఈనెల 28వ తేదీన తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తరుణంలో నెక్కొండ మండలం నుండి భారీగా ప్రజలు తరలి రావాలని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సంఘని సూరయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమేష్ నాయక్, జడ్పిటిసి సరోజా హరికిషన్, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేష్ యాదవ్, మాజీ మార్కెట్ చైర్మన్ సోమయ్య, రెడ్లవాడ సొసైటీ చైర్మన్ జలగం సంపత్ రావు, మాజీ ఎంపీపీ ఆవుల చంద్రయ్య, మాజీ వైస్ ఎంపీపీ సారంగపాణి, చల్ల చెన్నకేశవరెడ్డి, నెక్కొండ పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షుడు కొంజేటి బిక్షపతి, సూరిపల్లి సొసైటీ చైర్మన్ దామోదర్ రెడ్డి, భద్రయ్య, బిఆర్ఎస్ క్లస్టర్లు ఇన్చార్జులు, తదితరులు పాల్గొన్నారు.