*వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండండి…
*సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోండి..
*ఆరోగ్య సూత్రాలను పాటించండి..
*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..
చిత్తూరు(నేటి ధాత్రి) ఏప్రిల్ 10:
ఎండలు మండుతున్న దరిమిలా. వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండి.ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ
తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు ప్రజలకు సూచించారు.
పెరికే ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం చిత్తూరులోని సి.యస్.ఐ.
చర్చిలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత మెడికల్ క్యాంపును చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మెడికల్ క్యాంపు నిర్వహించిన పెరికే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పెరికే వరప్రసాద్ ను ఈ సందర్భంగా ఎంపి దగ్గుమళ్ళ ప్రసాదరావు అభినందించారు. ఉచితంగా పరీక్షల నిర్వహించుకున్న రోగులకు ఆయన మందులను పంపిణీ చేశారు. మారుతున్న కాలానుగుణంగా ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షల నిర్వహించుకొని, తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అశోక్, సి.యస్.ఐ.చర్చ్ మత పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు..