
దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
దుగ్గొండి మండల ప్రజలకు విజ్ఞప్తి..ఎస్సై రణధీర్.
నర్సంపేట,నేటిధాత్రి:
దుగ్గొండి మండలంలో కొందరు దొంగతనాలకు పాల్పడేవారు తిరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రావుల రణధీర్ ప్రజలకు కోరారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ నెక్కొండ మండలంలోని పనికర గ్రామ సమీపంలో ఒంటరిగా ఉన్న మహిళ ఇంటిలోకి గుర్తుతెలియని వ్యక్తులు వెళ్లి మెడపై కత్తిపెట్టి ఆమె చెవికి ఉన్న బంగారు కమ్మలు, ఇంట్లో బీరువా తీసి బంగారం నగదు ఎత్తుకెల్లారని తెలిపారు.దొంగతనానికి పాల్పడిన ఇద్దరు దుండగులు ముఖానికి మాస్క్ ధరించి , చేతులకు గ్లౌజ్ పెట్టుకొని వచ్చారని అన్నారు.చైన్ స్నాచింగ్ కొరకు ఒంటరి మహిళలను, వృద్దులను టార్గెట్ చేసే అవకాశం ఉన్నందున దుగ్గొండి మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రణధీర్ విజ్ఞప్తి చేశారు.