జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్
భూపాలపల్లి నేటిధాత్రి
రాబోయే వర్ష కాల సమయంలో సీజనల్ వ్యాధుల పై అవగాహన నివారణ చర్యలు తీసుకోవాలని సమాజంలో అవగాహన కల్పిస్తూ డెంగ్యూ నిర్మూలించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ అన్నారు
గురువారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పురపాలక సంఘం కార్యాలయంలో ప్రపంచ డెంగ్యూ వ్యాధి నివారణ దినోత్సవ కార్యక్రమం జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ అధ్యక్షత కార్యక్రమం నిర్వహించారు
ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ సమాజంతో బాగా స్వామ్యమై డెంగ్యూను నివారించాలని సమాజంలోని ప్రజలందరికీ డెంగ్యూ వ్యాధిపై అవగాహన ద్వారా నిర్మూలించవచ్చని అన్నారు జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో కమ్యూనిటీ సెంటర్లలో గ్రామాలలో నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు ప్రజలతో మమేకమై ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రతి శుక్రవారం డ్రైడేను పాటించి ఎక్కువ కాలం నిల్వ చేసి ఉన్న వస్తువులను కొబ్బరి బొండాలు కూలర్స్ చెత్త కుండీలలో నీరు నిలువ ఉండకుండా చూడాలి నివాస పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని తద్వారా వాది వ్యాధి బారిన పడకుండా ఉంటారని అన్నారు
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ నాగయ్య ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఉమాదేవి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రోహిణి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సిహెచ్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు