
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.
నల్లబెల్లి, నేటి ధాత్రి: మండలంలోని కొండాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ శంకు, భూలక్ష్మి సమేత, భువనేశ్వర స్వామి (గ్రామ దేవత బొడ్రాయి) ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ దేవతల చల్లని దీవెనలతో కొండాపూర్ ప్రజలందరూ పాడిపంటలు సిరి సంపదతో సుఖ సంతోషాలతో విరజిల్లాలని ఆ దేవతల చల్లని చూపు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అని ఆయన అన్నారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, ఎంపీపీ ఊడుగుల సునీత ప్రవీణ్ గౌడ్, ఫ్యాక్స్ చైర్మన్ మురళీధర్ రావు, వైస్ ఎంపీపీ గందే శ్రీలత శ్రీనివాస్ గుప్తా, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచులు గూబ తిరుపతమ్మ రాజు, చింతపట్ల సురేష్, ఎంపీటీసీలు, క్లస్టర్ ఇన్చార్జిలు, నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.