సీజనల్ జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

డా”ప్రత్యూష

గంగారం, నేటిధాత్రి :

గత వారం పది రోజులుగా గంగారం మండలం లో వాన ముసురు వదలడం లేదు.వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తడిసి ముద్దవుతున్నారు. మరో మూడు రోజులు వాన ముసురు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సీజన్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో గంగారం మండల ప్రభుత్వ వైద్యలు డా”ప్రత్యూష అప్రమత్తమై….సీజన్ వ్యాధులను అరికట్టేందుకు రంగంలోకి దిగింది. వాన ముసురులో జాగ్రత్తగా ఉండకపోతే, వ్యాధుల బారిన పడక తప్పదని హెచ్చరిస్తూ
బుధవారం రోజు గంగారం మండల కేంద్రం లోని బుర్కా వారి గుంపులో ఇంటిటీకి వెళ్లి అందరికి పరీక్షలు చేసి జ్వరాల బాధితులు రక్త నమూనలను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి కి ల్యాబ్ పంపించారు
దగ్గు జలుబు జ్వరాలు ఉన్న వారికి ఇంజెక్షన్ మందులు ఇచ్చారు ఈ సందర్బంగా డా’ప్రత్యూష మాట్లాడుతూ
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇళ్ల పరిసరాల్లో వాన, మురుగు నీటి నిల్వలు పెరుగుతున్నాయి..ఈగలు, దోమలు భారీగా వృద్ధి చెందుతుయి..ఇప్పటికే వాతావరణ మార్పులతో జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఫ్లూ జ్వరాలు విజృంభిస్తున్నాయి..వరద, మురుగు నీటి నిల్వల కారణంగా డయేరియా, జిగట విరేచనాలు, కామెర్లు, గ్యాస్ట్రోఎంటరైటిస్‌, మలేరియా, డెంగీ, గున్యా, మెదడు వాపు తదితర వ్యాధుల ముప్పు పొంచి ఉంటుదని
దోమలు వృద్ధి చెందకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టలని చెప్తూ తానే స్వయంగా ఇల్లుఇల్లు తిరుగుతూ డ్రమ్ములో నిల్వ ఉన్న నీటి పడేశారు వర్షాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వర్షాకాలంలో ప్రధానంగా తాగునీరు కలుషితమయ్యే అవకాశాలెక్కువ. ప్రజలు సాధ్యమైనంత వరకూ వేడిచేసి చల్లార్చిన నీటినే తాగాలి. ముఖ్యంగా శరీరంపై గాయాలకు వరదనీరు తాకితే.. వెంటనే సబ్బుతో శుభ్రపర్చి, చికిత్స అందించాలి. చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవాలి. విద్యుత్‌ తీగలు, ఉపకరణాలను పక్కకు జరపాల్సి వచ్చినప్పుడు.. ముందుగా విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలి.ఇళ్లలో పగుళ్లు, నీరు కారడం వంటివి కనిపిస్తే అప్రమత్తమవ్వాలి. ఇళ్లలో పాత సామాన్లు, నీళ్ల డ్రమ్ములు, వాడిపడేసిన టైర్లు, కూలర్లు..తదితరాల్లో, పరిసరాల్లో నీరు నిలిచి ఉండకుండా జాగ్రత్తపడాలి. నిల్వ నీటిపై తరచూ దోమల మందు పిచికారీ చేయాలి. ఇళ్లలో దోమతెరలు, దోమల సంహారిణులు వాడాలి. మాస్కు ధరించడంతో క పాటు కాలానుగుణ వ్యాధుల నుంచి సైతం రక్షణ పొందవచ్చు. వాతావరణం చల్లబడడంతో బ్యాక్టీరియా, వైరస్‌లు విజృంభించడానికి అనుకూల కాలమిది. జలుబు, దగ్గు, గొంతునొప్పి, నిమోనియా, డెంగీ, డయేరియా, టైఫాయిడ్‌ తదితర సమస్యలు వస్తాయని ముఖ్యంగా పిల్లల్లో వీటి తీవ్రత అధికంగా ఉంటుంది. తాగునీటి పైపులైన్లు పగిలి, మురుగు నీటితో కలిసే అవకాశాలెక్కువగా ఇలాంటప్పుడు మలం, రసాయనాలు, బ్యాక్టీరియా, వైరస్‌లు తాగు నీటిలోకి చేరిపోతాయి. ఫలితంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని అవసరముంటే తప్ప బయటకు వెళ్లొద్దు..వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం వేడిగా ఉన్నప్పుడే తీసుకుంటే మంచిది..జ్వరం, జలుబు, దగ్గు సమస్యలు మూడు రోజులైనా తగ్గకపోతె నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రి రావాలని గత వారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున ఆహారం, నీరు కలుషితం కాకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో లభించే తినుబండారాలు, పానిపూరి, వంటి వాటిని తింటే రోగాల బారిన పడే అవకాశం ఉందని ప్రజలు సరైన ఆహారం, మంచినీరు తీసుకోవడం ద్వారా ప్రజలు ఈ వ్యాధుల నుంచి సురక్షితంగా బయటపడొచ్చని వేడివేడి ఆహారం తీసుకోవాలని.ప్రజలకు పలు ఆరోగ్య సూచనలు చేశారు ఈ కార్యక్రమం లో ఏఎన్ఎం రమాదేవి. ఆశ వర్కర్స్,నాగమణి రజిత. గ్రామస్తులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *