మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అవగాహన సదస్సు *.
పరకాల ఏసిపి కిషోర్ కుమార్
శాయంపేట నేటి ధాత్రి :
శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో ఈ నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి పత్తిపాక గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పరకాల ఏసిపి కిషోర్ కుమార్, శాయంపేట సీఐ మల్లేష్, ఎస్సై దేవేందర్ ముఖ్య అతిథిగా పరకాల ఏసిపి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నాం నిర్భయంగా ఓటేసేలా ప్రజల్లో నమ్మకానికి కలిగించేందుకే ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఓటును అమ్ముకోవద్దు డబ్బులకు లొంగిపోవద్దు ఓటు కోసం డబ్బులు పంచిన, తీసుకున్నా నేరమే శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగడంలో ప్రజలు భాగస్వామ్యంలో ఉంటే నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసే క్రమంలో భయాన్ని తొలగించేలా పోలీస్ శాఖ భరోసా కల్పిస్తుంది.ఈ ఎన్నికల సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వారి యొక్క ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా నిష్పక్షపాతంగా ఉపయోగించుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఏదైనా నేరాలకు పాల్పడినట్లు అయితే దాని పర్యవసనం తీవ్రంగా ఉంటుందని తెలిపారు. గ్రామాలలో ఉన్న ప్రజలు గ్రూపులుగా విడిపోయి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడదని తెలిపినాడు. ఎన్నికల దృష్ట్యా గ్రామాలలో మద్యం మరియు డబ్బులు పంపిణీ చేసినట్లయితే ఎన్నికలకమిషన్ వారు ఏర్పాటు చేసిన 1950 నెంబర్ కి కాల్ చేసి సమాచారం అందించగలరని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న అన్ని పార్టీల కార్యకర్తలు , గ్రామ యూత్ వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.