భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మైనార్టీ బి ఆర్ ఎస్ నాయకులు సజావుద్దీన్.
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఝరాసంగం మండల ప్రజలకు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రత ప్రజలు అప్రమత్తంతోపాటు తగిన చర్యలు తీసుకోవాలని మైనార్టీ బి ఆర్ ఎస్ నాయకులు సజావుద్దీన్.తెలిపారు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో ఉ ష్ణోగ్రతలు తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ జారీ చేయడంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరం అయితేనే బయటకు రావాలని వచ్చేముందు వాహనదారులు తలకు హెల్మెట్ ధరించాలని తెలిపారు హైదరాబాద్ సంగారెడ్డి మంచిర్యాల జిల్లాలలో 42 డిగ్రీలు వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు ఒకవైపు ఎండలు పెరగడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు అవసరమైతేనే తప్ప ఎండలో బయటకు వెళ్లకూడదని సూచించారు. బయటకు వెళ్లిన గొడుగులు వెంట తీసుకువెళ్లాలని సూచించారు ఎండ బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మైనార్టీ బి ఆర్ ఎస్ నాయకులు సజావుద్దీన్.సూచించారు.