
SI M.Ramesh.
వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పరకాల ఎస్సై ఎం.రమేష్
పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణ మరియు మండలంలోని రైతులు,లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుందనీ ఎస్సై ఎం.రమేష్ మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అత్యవసరం ఉంటే తప్పా వర్షాల సమయంలో రైతులు,ప్రజలు బయటికి రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని,చెట్లకింద,శితిలావస్థలో ఉన్న భవనాల సమీపలలో ఉండరాదని కోరారు.