
People from all walks of life should come forward to protect the Constitution.
రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలి
★గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించిన జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్
జహీరాబాద్. నేటి ధాత్రి:
టీపీసీసీ ఏక్సిక్యూటివ్ మెంబెర్ ధనాలక్మి
కోహిర్ మండలంలోని పిచరాగాడి గ్రామంలో “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ” రాజ్యాంగ పరిరక్షణ సన్నాక సమావేశం మరియు పాదయాత్ర నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్. మరియు టిపిసిసి ఎగ్జిక్యూటివ్ మెంబర్ ధనలక్ష్మి కోహిర్ మండల పార్టీ అధ్యక్షులు రామలింగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి పౌరుని హక్కు అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానిస్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నామని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం యొక్క విలువలు రాజ్యాంగ స్ఫూర్తిని గ్రామ ప్రజలకు వివరించారు. యాత్రలో పాల్గొన్న ప్రజలందరికీ మాజీ మంత్రి గారు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అర్షద్ గ్రామ పార్టీ అధ్యక్షులు వీర రెడ్డి,కోహిర్ టౌన్ అధ్యక్షులు.శంషీర్,మాజీ ఎంపిపి షౌకత్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముజమ్మిల్,బాడంపేట్ ఆలయ కమిటీ చైర్మన్ దయానంద పాటిల్, మాజీ సర్పంచ్ అంజయ్య ,మరియు వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.