
ప్రజ్వల్ ఎఫ్ పి సి ఎల్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రారంభం
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం నరసింహ పల్లె గ్రామంలో లయన్స్ క్లబ్ వారిచే మారి ప్రాజెక్ట్ ఎఫ్.పిసిఎల్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని గ్రామ కార్యదర్శి తిరుపతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభం అయింది ఉచిత కంటి వైద్య శిబిరంలో 81 మంది కంటి పరీక్షలు చేయగా ఇందులో కంటి సమస్యలకు బాధపడుతున్న వారిని 18 మందిని గుర్తించారు ఉచిత కంటి ఆపరేషన్ లయన్స్ క్లబ్ వారు అందిస్తున్న సేవలకు గ్రామ ప్రజలు అభినందించారు. ప్రజ్వల్ ఎఫ్ పి సీ ఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు సరైన చికిత్స చేయించుకోవాలన్నారు ఇందులో అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉన్నారని అందివచ్చిన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకో వాల న్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డాక్టర్ గుంటోజు వెంకన్న, ఆప్తమిక్ రాజేష్, గ్రామ రైతులు లడే సాంబయ్య, రాజయ్య, సునీత, వీరమనీ గడ్డి సాంబయ్య, ప్రతాప్, రాజిరెడ్డి,నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.